revanth reddy

వరంగల్‌కు విమానాశ్రయం: సీఎం రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధివైపుకు పరుగులు తీస్తోంది. తాజాగా వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వ‌రంగ‌ల్ (మామునూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ స‌మీక్ష నిర్వ‌హించారు.
వ‌రంగ‌ల్ ఔట‌ర్ రింగు రోడ్డు, రేడియ‌ల్ రోడ్లు విమానాశ్ర‌యానికి అనుసంధానంగా ఉండాల‌ని సీఎ రేవంత్ చెప్పారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతో పాటు ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల ప్ర‌జ‌లు భ‌విష్య‌త్‌లో వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం నుంచే రాక‌పోక‌లకు వీలుగా ర‌హ‌దారులు నిర్మించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఆదేశించారు. టెక్స్‌టైల్స్‌తో పాటు ఐటీ, ఫార్మా, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధితో హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ ఎదిగేలా ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని ముఖ్యమంత్రి అన్నారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం పూర్త‌యితే మేడారం జాత‌ర‌తో పాటు ల‌క్న‌వ‌రం, రామ‌ప్ప ఇత‌ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు సైతం దానినే వినియోగించుకుంటార‌ని సీఎం రేవంత్ తెలిపారు.
ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌ని, ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్ర‌యాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisements
Related Posts
Chicken Price : ఈరోజు కేజీ చికెన్ ధర ఎంతంటే?
Chickens in market

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో కోడి మాంసం వినియోగం మళ్లీ పెరుగుతోంది. ప్రజలు మళ్లీ నిర్భయంగా చికెన్‌ కొనుగోలు చేయడం ప్రారంభించడంతో Read more

తెలంగాణ లో మందుబాబులకు కిక్కు పెంచే న్యూస్
kicks drug addicts in Telan

తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ధరల పెంపుపై ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రభుత్వం వాటిని అంగీకరించలేదు. సాధారణంగా, Read more

Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ పై : హర్షసాయిపై కేసు నమోదు
Youtuber Harsha Sai బెట్టింగ్ యాప్స్ పై హర్షసాయిపై కేసు నమోదు

Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ పై : హర్షసాయిపై కేసు నమోదు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, వాటికి Read more

దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం అంటు రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం అంటు రేవంత్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం అంటు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ Read more

Advertisements
×