ఇటీవలి వార్తల ప్రకారం, భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ అతడికి చివరి అంతర్జాతీయ టోర్నీ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాకపోవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.రోహిత్ కెరీర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే అతడు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్న ప్రధాన ప్రశ్న రోహిత్ శర్మ ఇంకా ఎంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడనేది.
తాజా నివేదికల ప్రకారం, అతని కెరీర్ మరికొద్ది నెలల్లో ముగియనుంది.జనవరి 11న జరిగిన బీసీసీఐ సెలెక్టర్ల సమావేశంలో రోహిత్ హాజరయ్యాడు. సమావేశంలో అతడిని మరో కెప్టెన్ నియమించుకునే వరకు జట్టు నాయకత్వం కొనసాగించాలని నిర్ణయించారు.కానీ, కొన్ని వార్తా సంస్థల ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్‌కు చివరి టోర్నమెంట్ కావచ్చని సమాచారం.
దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం,జూన్-జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా సిద్ధమవుతోంది.కానీ,రోహిత్ ఆ పర్యటనకు ఎంపిక కానే అవకాశం లేదు.దీంతో,ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే అతని అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసే అవకాశముంది.ఈ టోర్నీలో టీమిండియా మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న జరగనుంది.సెమీఫైనల్‌కు చేరకపోతే, ఆ రోజు రోహిత్ కెరీర్‌లో చివరి మ్యాచ్ కావచ్చు. సెమీఫైనల్ చేరి ఓడిపోతే, మార్చి 4 అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలుస్తుంది.ఫైనల్‌కు చేరితే, మార్చి 9 రోహిత్ కెరీర్‌లో చివరి రోజు కావొచ్చు.ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.అందువల్ల, అతడు సిడ్నీ టెస్టుకు ఎంపిక కాలేదు.ఇది ఇంగ్లండ్ పర్యటనకు అతడి ఎంపికపై సందేహాలు పెంచుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా 2027లో ప్రపంచ కప్ ఆడాల్సి ఉంటుంది.