రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని మహబూబ్ నగర్ రైతు పండుగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరుగుతున్న రైతు పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. ముందుగా రైతు పండుగ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం రేవంత్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
అనంతరం మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సంబరాలు జరుపుతుంది. ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ సర్కార్ గొప్ప వరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం..ఈరోజు పాలమూరు వేదికగా నాల్గో విడత రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసింది. తొలి విడత 11 లక్షల 34 వేల 412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండో విడతలో మరో ఆరున్నర లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. మూడో విడతలో నాలుగున్నర లక్షల మందికి 2 లక్షల వరకు చేసింది.
శనివారం నాలుగో విడతగా మూడు లక్షల మంది రైతులకు 3 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా? ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా? రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తమదేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం కట్టిన అన్నడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టిన అన్నాడు.
కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్షా ఎనభైమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడన్నారు. కాళేశ్వరానికే లక్షా రెండువేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అన్ని కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులు కుప్పకూలిపోయి చుక్కనీరు లిఫ్ట్ చేయకపోయినా కాంగ్రెస్ హయాంలో కట్టిన మంజీర, కోయిలసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లిలాంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి ఈ సంవత్సరం లేకపోయినా 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించామని అన్నారు.