formers

రైతుభరోసా పరిమితి, మార్గదర్శకాలు

రైతులకు తమ ప్రభుత్వం మేలుచేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆ దిశగా చర్చలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా రైతు భరోసా అర్హత .. పరిమితి పైన మంత్రివర్గ ఉప సంఘం సుదీర్ఘంగా చర్చించింది. సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతిపాదనకు దాదాపు ఆమోదం లభించింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశం పై సుదీర్ఘంగా చర్చించింది. సంక్రాంతికి రైతుభరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisements
rythu bharosa telangana

కీలక ప్రతిపాదనలు
ఐటీ చెల్లిస్తున్న వారిలో ఎవరికి మినహాయింపు ఇవ్వాలి.. ఎవరిని కొనసాగించాలి అనే అంశం పైన కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపు దారులు అందరినీ పథకం నుంచి మినహాయిస్తే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అయింది.
20 లక్షల మంది కి కోత?
గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చారు. ప్రభుత్వం సాగు భూములకే ఇవ్వాలని నిర్ణయిస్తే దాదాపు 20 లక్షల మంది కి కోత పడే అవకాశం ఉందని అంచనా.

జనవరి తొలి వారంలోనే విధి విధానాలు పూర్తి చేసి.. మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు. సంక్రాంతికి నిధులు విడుదల చేసే విషయానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

వీరికి మినహాయింపు
వారికి మినహాయింపు పీఎం – కిసాన్ లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు, వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులకు పథకం అమలు చేయటం లేదు. ఇదే విధంగా ఈ వర్గాలను అమలుకు దూరంగా ఉంచాలంటే వచ్చే ఇబ్బందుల పైనా చర్చ జరిగింది.

ఈ పథకం అమల్లో భాగంగా మొత్తంగా రూ 80,453 కోట్లు చెల్లించగా.. ఇందులో సాగు భూముల కోసం రూ 21,284 కోట్లు చెల్లించారని అధికారులు నివేదిక ఇచ్చారు.

Related Posts
పుష్ప 2 నిర్మాతలు 50 లక్షల విరాళం
పుష్ప 2 నిర్మాతలు 50 లక్షల విరాళం

పుష్ప 2 తొక్కిసలాట బాధిత కుటుంబానికి చిత్ర నిర్మాత అందించిన 50 లక్షల చెక్కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని, అల్లు అర్జున్ నటించిన Read more

Shamshabad Airport: ప్రయాణికుల రాకపోకలతో శంషాబాద్ విమానాశ్రయం రికార్డు
Shamshabad Airport: ప్రయాణికుల రాకపోకలతో శంషాబాద్ విమానాశ్రయం రికార్డు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు దుమ్ము రేపుతోంది! హైదరాబాద్ నగరానికి గౌరవంగా నిలుస్తున్న శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో Read more

Telengana: ఆత్మహత్యకు దారితీసిన సోషల్ మీడియా ప్రేమ..ఎక్కడంటే?
Telengana: ఆత్మహత్యకు దారితీసిన సోషల్ మీడియా ప్రేమ..ఎక్కడంటే?

ప్రేమలో పడటమే కాదు, జీవితాన్ని అనుభవించగలిగే తత్త్వం ఉండాలి. కానీ కొన్ని క్షణికావేశ నిర్ణయాలు, అనుభవం లేని వయస్సు కొన్ని ప్రాణాలను బలితీసుకుంటుంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో Read more

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఆమ్రపాలి
Amrapali approached Telangana High Court

హైరదాబాద్‌: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును ఆమె ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆమెతో పాటు రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, Read more

×