revanth reddy, satya nadella

రేవంత్ రెడ్డికి శుభవార్త చెప్పిన స‌త్య నాదెళ్ల‌

ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుకు దూసుకుని వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్లతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉండాల‌నే త‌మ నిబద్ధతను కొన‌సాగిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు.

హైద‌రాబాద్‌లోని స‌త్య నాదెళ్ల నివాసంలో ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమ‌వారం భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా నైపుణ్యాభివృద్ధి, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త‌ను స‌త్య నాదెళ్ల ప్ర‌శంసించారు.

Revanth Reddy and CEO Satya Nadella


హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థ
నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక‌ వ‌స‌తులే ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని స‌త్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒక‌ట‌ని, ప్ర‌స్తుతం 10,000 మందికి ఉపాధి క‌ల్పిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌త్య నాదెళ్ల‌కు తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల (MW) సామ‌ర్థ్యం క‌లిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబ‌డి పెట్టింద‌ని, హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు స‌త్య నాదెళ్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
మైక్రోసాఫ్ట్ మ‌ద్ద‌తును కోరిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను టెక్నాలజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపివేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టిసారిస్తున్న ఏఐ, Gen AI, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణ‌మైన వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స‌త్య నాదెళ్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Related Posts
కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం
కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం పేపర్ ప్లేట్ పరిశ్రమలో చోటు చేసుకుంది, ఇక్కడ Read more

నేటి నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు..
Teacher mlc nominations from today

హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్లగొండలోనే నామినేషన్లు Read more

నల్లబెల్లి మండలంలో పెద్దపులి సంచారం
nallabelli

వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతులు, కూలిలకు ఆ వ్యవసాయ భూమిలో ఏదో అడవి జంతువు పాదముద్రలు కనిపించడం తో అందులో కొంత మంది రైతులు పెద్దపులి Read more

కొత్త కారు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..ధర తెలిస్తే షాకే
mla mynampally rohit

రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ తెలంగాణలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.3 కోట్ల విలువైన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *