revanth, babu

రేవంత్ నిర్ణయం ఏపీపైనా ప్రభావం

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. దీంతో ఇబ్బందుల్లో పడ్డ టాలీవుడ్ .. చివరి ప్రయత్నంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజును తీసుకెళ్లి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ భేటీతో వీరిద్దరి మధ్య దూరం తగ్గుతుందనుకుంటే మరింత పెరిగేలా ఉంది. అదే సమయంలో ఈ భేటీ ప్రభావం ఏపీపైనా పడబోతోంది.
తెలంగాణలో టాలీవుడ్ సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకూడదన్న తమ నిర్ణయంలో మార్పేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశారు. దీంతో టాలీవుడ్ కు, అందులో భాగమైన ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకూ భారీ షాక్ తప్పలేదు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రూపంలో రెండు సినిమాల విడుదలకు సిద్దమైన దిల్ రాజుకు రేవంత్ నిర్ణయం మింగుడుపడని పరిస్ధితి. అలాగే తర్వాత రాబోయే సినిమాలకూ షాక్ తప్పడం లేదు.

Advertisements
Related Posts
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పెరుగుతున్న కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు
MLC Jeevan Reddy has growing support from Congress seniors

హైదరాబాద్‌: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు జీవన్‌రెడ్డికి అనుచరుడు Read more

Saleshwaram Jatara: సలేశ్వరం జాతరలో తొక్కిసలాట, పలువురికి గాయాలు
Saleshwaram Jatara: సలేశ్వరం జాతరలో తొక్కిసలాట, పలువురికి గాయాలు

తెలంగాణ అమరనాథ్ యాత్రలో విషాదం – సలేశ్వరం జాతరలో తొక్కిసలాట కలకలం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతర ఈ సంవత్సరం కూడా భారీ భక్తజన సమూహంతో ఘనంగా Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి మరో విజయాన్ని అందించాయి. గతంలో మూడుసార్లు విజయం సాధించిన టీడీపీ, ఈసారి కూడా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో Read more

పోసాని పై CID కేసు నమోదు
posani

తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో Read more

×