amaran ott

రేపటి నుండి ‘అమరన్’ సినిమా OTTలో స్ట్రీమింగ్ ప్రారంభం

ప్రముఖ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన “అమరన్” సినిమా రేపటి నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. దీపావళి కానుకగా అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.300 కోట్లకి పైగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. శివకార్తికేయన్, సాయి పల్లవి నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం, కథ ఇలా అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అద్భుతమైన ప్రదర్శనతో ఈ చిత్రం సర్వసాధారణంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.

తమిళ్ సినిమాలు సాధారణంగా థియేటర్లలో రిలీజైన 28-30 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ..అమరన్ మూవీ మాత్రం కాస్త ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. దానికి కారణంగా..ఎవరూ ఊహించని విధంగా సినిమా వసూళ్లని రాబట్టడమే. అమరన్ రిలీజైన రోజే క, లక్కీ భాస్కర్ సినిమాలు కూడా విడుదలైనా.. ఈ రెండూ అమరన్‌ కలెక్షన్లతో పోటీపడలేకపోయాయి. లక్కీ భాస్కర్ రూ.100 కోట్ల దగ్గరే ఆగిపోగా.. క సినిమా రూ.50 కోట్ల మార్క్‌ని కూడా చేరుకోలేకపోయింది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి కూడా వచ్చేసిన విషయం తెలిసిందే.

అదే సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “మట్కా” సినిమా కూడా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. మరి థియేటర్స్ లోనే పట్టించుకోని సినీ ప్రేక్షకులు , ఓటిటి లో చూస్తారా అనేది సందేహమే.

Related Posts
పక్కా ప్రణాళికతో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్
revanth

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. తాజాగా దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగిందని ఆయన తెలిపారు. ఈ Read more

పార్లమెంట్‌లో విపక్షాల నిరసన..స్పీకర్‌ ఆగ్రహం
Opposition protest in Parliament angered Speaker

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల్లో భాగంగా శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. Read more

రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు
nagavamsi

టాలీవుడ్ ప్ర‌ముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే ముఖ్య‌మంత్రిని కలుస్తామ‌ని Read more

రియో డి జనీరియోలో ప్రధాని మోదీకి ఆధ్యాత్మిక స్వాగతం
welcoming

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రెజిల్ యొక్క రియో డి జనీరియోకు చేరుకున్నారు, అక్కడ 19వ G20 నాయకుల సదస్సు నవంబర్ 18 నుంచి 19 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *