హైదరాబాద్: కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోల్ హైదరాబాద్‌కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణెలో 130కిపైగా జీబీఎస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తొలి బీజీఎస్ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇదని తెలిపారు.

ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వెల్లడించారు. అయితే ఈ వైరస్ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, జీబీఎస్ అంటు వ్యాధి కాదని, చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చన్నారు.
కాగా, మహారాష్ట్రలో ఇప్పటికే వందకుపైగా జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సిండ్రోమ్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున సొంత నరాల వ్యవస్థపైనే దాడిచేస్తుంది.