divyenndu sharma

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ‘మీర్జాపూర్’ యాక్టర్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు మేకర్స్. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్‌ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్‌ టూర్స్‌ను ప్లాన్‌ చేశారు మేకర్స్‌. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాత.

Advertisements

ఇక ఈ సినిమా విడుదలకు ముందే రామ్‌చరణ్‌ తన తదుపరి చిత్రం చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ మైసూర్‌లోమొదలైంది. ఈ తొలిషెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్‌, హీరోయిన్‌ జాన్వీకపూర్‌తో పాటు చిత్రంలో ఇతర ముఖ్య పాత్రదారులు పాల్గొంటున్నారు. కొంత టాకీతో పాటు ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా ఇక్కడ షూట్‌ చేస్తారని సమాచారం. రత్నవేలు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ సంగీత దర్శకుడు ఏఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. వృధ్ధి సినిమాస్‌ పతాకంపై కిలారు సతీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర ఎంతో వైవిధ్యంగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందట. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు చరణ్‌ పాత్రను డిజైన్‌ చేసిన విధానం గొప్పగా ఉంటుందని ఫిలిం నగర్ టాక్‌.

అయితే ఈ సినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ న‌టుడు దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ.. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌నా ‘ఆర్‌సీ16’లో మున్నా భయ్యా న‌టించ‌బోతున్నాడు అంటూ ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భ‌య్య పాత్ర‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివ్యేండు. దీంతో ‘ఆర్‌సీ16’ సినిమాకు అత‌డు ప్ల‌స్ అవుతాడ‌ని చిత్ర‌బృందం భావించిన‌ట్లు ఉంది.

Related Posts
రమేష్ బిధూరిని సస్పెండ్ చేయాలి: సీతక్క డిమాండ్
Ramesh Bidhuri should be suspended.. Seethakka demands

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన రమేష్ బిధూరిపై తెలంగాణ మంత్రి సీతక్క Read more

ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు ఏఐ చాట్‌బోట్లు!
ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు ఏఐ చాట్ బోట్లు!

ఢిల్లీ పోలీసులు 'చునవ్ మిత్ర' మరియు 'సైబర్ సారథి' అనే రెండు ఏఐ ఆధారిత చాట్‌బోట్లను ప్రవేశపెట్టి, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను క్రమబద్ధీకరించడమే కాకుండా, ఎన్నికల సమయంలో Read more

Charles-3 : ఆసుపత్రిలో చేరిన కింగ్ ఛార్లెస్-3
king Charles 3

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 76 ఏళ్ల ఛార్లెస్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందుతున్న సమయంలో కొన్ని అనుకోని దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) Read more

దూల్‌పేటలో హోలీ వేడుకలో గంజాయి ఐస్‌క్రీం
1500x900 1474862 holi 2023

హైదరాబాద్‌లోని దూల్‌పేటలో హోలీ సంబరాల పేరుతో గంజాయి రహస్యంగా విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్, కుల్ఫీ, బర్ఫీ Read more

×