sharmila ramurthi

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల వైఎస్ షర్మిల సంతాపం

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం తెలియజేసారు. రామ్మూర్తి నాయుడు హఠాన్మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయినట్లు తెలిపారు. రామ్మూర్తి నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా నని, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ షర్మిల తెలియజేసారు.

Advertisements

రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణ వార్త తెలిసి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు..అక్కడి నుండి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు.

అలాగే రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకోవడం జరిగింది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన తమ్ముడి భౌతికకాయం చూసి చంద్రబాబు బోరున విలపించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related Posts
ఢిల్లీ కొత్త సీఎం ప్ర‌మాణం స్వీకారానికి టైం ఫిక్స్
NKV BJP

ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీ గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ Read more

మరోసారి ఆర్బీఐ కీలక నిర్ణయం..అందుకోసమేనటా..!
Once again, RBI key decision..what is the reason.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు మరోసారి చర్యలను ప్రకటించింది. Read more

AndhraPradesh :93వేల మంది వితంతువులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
AndhraPradesh :93వేల మంది వితంతువులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపుతో వేలాది మంది అర్హులు కొత్తగా పింఛన్ల మంజూరుపై ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అందుతున్న Read more

Robert : రాజకీయాల్లోకి రావాలని వాద్రా సంకల్పం
Robert : రాజకీయాల్లోకి రావాలని వాద్రా సంకల్పం

రాబర్ట్ వాద్రా రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త అయిన ప్రముఖ వ్యాపారవేత్త Robert వాద్రా రాజకీయాల్లోకి Read more

×