manchu

రాజకీయాల గురించి మాట్లాడను: మంచు మనోజ్

మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నిన్న ఆళ్లగడ్డకు వచ్చిన ఆయన దీనిపై మీడియాతో మాట్లాడారు. పొలిటికల్ ఎంట్రీపై మీడియా మనోజ్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని అన్నారు.
కుటుంబ వివాదాల కారణంగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరిగింది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని, జనసేన పార్టీలో వారు చేరబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. మోహన్ బాబుకు మంచు మనోజ్ ల మధ్య ఆస్తుల గొడవలతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసినదే. ఈ కేసులో మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వస్తున్న వార్తలో నేపథ్యంలో మంచు మనోజ్ రాజకీయాలపై చర్చలు వేడికి పుట్టిస్తున్నాయి. ఈ రోజు తన అత్తగారి జయంతి అని, అందుకోసమే మొదటిసారి తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డ తీసుకొచ్చామని తెలిపారు. జయంతి రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకురాలేదన్నారు. తమ కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారని అందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పారు.

Advertisements
Related Posts
ఇకపై జనసేన రిజిస్టర్డ్ పార్టీ కాదు…గుర్తింపు పొందిన పార్టీ
janasena

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు లభించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు లేఖ పంపిస్తూ, జనసేనకు గాజు గ్లాస్ Read more

Rain: రానున్న 3 రోజుల్లో ఆంధ్రాకి వర్ష సూచన
Rain Alert: రానున్న 3 రోజుల్లో ఆంధ్రాకి వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం తలకిందులైందా? తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉదయాన్నే భానుడి రక్షణ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఎండలు భయపెడుతుంటే, Read more

Fishing Ban : ఏపీలో ఈ నెల 15 నుంచి చేపల వేట నిషేధం
Fishing ban in AP from 15th of this month

Fishing Ban : ఏపీలో సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ … కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా Read more

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. Read more

×