రమ్యకృష్ణ నటనకి చాల అవార్డులు

రమ్యకృష్ణ నటనకి చాల అవార్డులు

రమ్యకృష్ణ అనే పేరు వినిపించగానే ప్రేక్షకులు ఆమె ఎనలేని నటనను గుర్తుచేసుకుంటారు. నీలాంబరి నుండి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రల్లో ఆమె చేసిన ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆమె గర్వించదగిన కెరీర్‌లో అనేక అవార్డులు అందుకున్నారు. ఆ అవార్డులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘కంటే కూతుర్నే కనాలి’ చిత్రంలో రమ్యకృష్ణ నటనకు నంది అవార్డుల వేడుకలో ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు.

ramyakrishna
ramyakrishna

ఇది ఆమె మొదటి అవార్డు.1999లో వచ్చిన ‘పాడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’) సినిమాలో నీలాంబరి పాత్రతో ఆమె తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ నటి – తమిళం విభాగంలో అవార్డును అందుకున్నారు.2009లో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలో హీరో సిద్దార్థ్ తల్లిగా చేసిన పాత్రకు 57వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ సహాయ నటి – తెలుగు అవార్డు లభించింది. అదే ఏడాది ‘రాజు మహారాజు’ సినిమాకు కూడా ఉత్తమ సహాయ నటి అవార్డును పొందారు.2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలో రాజమాత శివగామి దేవిగా ఆమె నటనకు మొత్తం 5 అవార్డులు అందుకున్నారు.

kante koothurne kanu
kante koothurne kanu

ఇందులో ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆనంద వికటన్ సినిమా అవార్డు, IIFA ఉత్సవం తెలుగు మరియు తమిళ విభాగాలలో 2 అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఉన్నాయి.2017లో ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ సినిమాలో శివగామిగా చేసిన పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరియు బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్నారు. బాహుబలి రెండు పార్ట్స్ కలిపి ఆమె మొత్తం 7 అవార్డులు గెలుచుకున్నారు.తర్వాత ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో ఆమె పాత్రకు ఉత్తమ సహాయ నటి (ఫిమేల్) విభాగంలో జీ సినీ అవార్డు (తమిళం) మరియు ఆనంద వికటన్ సినిమా అవార్డు లభించాయి.

Related Posts
సంక్రాంతి వస్తున్నాం ట్రైలర్ అదుర్స్..
సంక్రాంతి వస్తున్నాం ట్రైలర్ అదుర్స్..

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్నాం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2,ఎఫ్3 Read more

క్రిస్మస్ తాతగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరో..
tollywood

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఈ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన క్రేజీ Read more

2025 సమ్మర్‎కి ఆ స్టార్స్ సందడి..
ghatti movie

2024 ముగింపు దశలోకి వచ్చిన నేపథ్యంలో,ప్రేక్షకుల దృష్టి మొత్తం 2025లో రాబోయే బిగ్ రిలీజ్‌లపై పడింది. సంక్రాంతి రిలీజ్ డేట్లు ఇప్పటికే ఖరారవ్వగా,సమ్మర్ 2025 కూడా భారీ Read more

ఈనెల 30న ఇష్క్ గ్రాండ్ రీ-రిలీజ్
nithin ishq movie

హీరో నితిన్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "ఇష్క్." విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ సరసన నిత్యా మీనన్ Read more