yogi

యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ మెసేజ్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు దుండగులు మెసేజ్ పంపడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 10 రోజుల్లోగా యోగి రాజీనామా చేయాలి.. చేయకుంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని చంపినట్లే యోగిని హతం చేస్తామని మెసేజ్ పంపారు. మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisements

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత బాబా సిద్ధీకీ గత నెలలో దారుణంగా హయం చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషాన్ సిద్ధీకీ ఆఫీసు ముందు దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన సిద్ధీకీ, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు.

ఈ హత్యకు 15 రోజుల ముందు సిద్ధీకీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, సల్మాన్ ఖాన్‌కు ఆత్మీయుడు కావడం వల్లే బాబా సిద్ధీకీని హతం చేసినట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌ను కూడా చంపేస్తామని బెదిరించారు. ప్రస్తుతం, జీషాన్ సిద్ధీకీకి కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వచ్చిన ఫోన్ కాల్ పోలీసులకు తీవ్ర అప్రమత్తతను కలిగించింది.

Related Posts
Bank Customers : బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త
bank customers

బ్యాంక్ ఖాతాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నామినీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఒక్క నామినీ మాత్రమే చేర్చుకునే అవకాశం ఉండగా, తాజాగా నలుగురు నామినీలను Read more

IPL2025:ఐపీఎల్ లో ఆటగాళ్లకు లేదు భద్రత..
IPL2025:ఐపీఎల్ లో ఆటగాళ్లకు లేదు భద్రత..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో ఆటగాళ్ల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్టేడియంలో కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నప్పటికీ, అభిమానులు మైదానంలోకి చొచ్చుకురావడం Read more

గోల్డ్ కార్డ్ విసా: భారతీయులపై ప్రభావం
గోల్డ్ కార్డ్ విసా: భారతీయులపై ప్రభావం

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపడం, నిధుల నిలిపివేత వంటి చర్యలతో భారతీయులు సహా Read more

ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ వీసాలు రద్దు.. ఎందుకంటే?
student visas to Australia

అమెరికాలో విద్యార్థుల కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలకు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ఆస్ట్రేలియాలో కూడా కొనసాగుతోంది. విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ Read more

×