Pawan Kalyan Dil Raju

మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం:పవన్, దిల్ రాజు

‘గేమ్ ఛేంజ‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌మాద‌వశాత్తు మ‌ర‌ణించిన ఇద్దరు అభిమానుల‌కు నిర్మాత దిల్‌రాజు రూ.10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ‘గేమ్ ఛేంజ‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Advertisements

ఆ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) మ‌ర‌ణించారు.ఇక ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే నిర్మాత దిల్‌రాజు మీడియా స‌మ‌క్షంలో స్పందించారు.

ఆయ‌న మాట్లాడుతూ.. ” ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఆ విష‌యంపై మేం సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇలా ఇద్ద‌రు అభిమానులు తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను.

నా వంతుగా వారి కుటుంబాల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను” అని అన్నారు.

Related Posts
APలో బర్డ్ ఫ్లూ భయం – కోడి మాంసం తినడం సురక్షితమేనా?
బర్డ్ ఫ్లూ భయం – ఏపీ ప్రభుత్వం ప్రజలకు జారీ చేసిన జాగ్రత్త సూచనలు!

బర్డ్ ఫ్లూ కలకలం: ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పక్షుల Read more

సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు మంచు విష్ణు కీలక ప్రకటన
manchu vishnu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు ఇటీవల సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తాజా ఘటనల నేపథ్యంలో, ప్రత్యేకంగా సంధ్య Read more

అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు
అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. ఆయన Read more

సంక్రాంతికి 26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway has announced 26 special trains for Sankranti

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలు భారీగా ప్రయాణాలు చేసే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. పండుగ Read more

×