encounter in chhattisgarh

మావోలకు మరో దెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంట‌ర్

ఇటీవల కాలంలో మావోలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో వరుసపెట్టి మావోలు కన్నుమూస్తున్నారు. తాజాగా ఈరోజు శనివారం బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోలు మృతి చెందారు. భద్రతాబలగాల్లో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి కాలిలో బుల్లెట్‌ దిగగా, మరొకరికి తలలోకి వెళ్లింది. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి భద్రతాబలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాంకేర్ జిల్లా-నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్‌మద్ ప్రాంతంలో మావోలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్-స్పెషల్ టాస్క్ ఫోర్సు బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దీంతో మావోయిస్టులకు- భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Related Posts
Donald Trump: ట్రంప్ సుంకాల దెబ్బ: భారత్‌కు ఎంత నష్టం?
ట్రంప్ సుంకాల దెబ్బ: భారత్‌కు ఎంత నష్టం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాలు విధించబోతున్నారు. సుంకాలు విధించబడే దేశాల లిస్టులో ఇండియా పేరు కూడా ఉంది, దింతో భారతదేశంలో Read more

Anand Mahindra: నా మండే మోటివేషన్‌ ఆయనే : ఆనంద్‌ మహీంద్రా
He is my monday motivation.. Anand Mahindra

Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఈరోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన యువ ఐఏఎస్‌ అధికారి Read more

మోదీ కంటే కేజీవాలే కన్నింగ్ – రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ Read more

కాంగ్రెస్ 7 రోజులు కార్యక్రమాలు నిలిపివేసింది..
manmohan singh

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ప్రధాని డాక్టర్ మాన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళి అర్పిస్తూ, తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. కాంగ్రెస్ పార్టీ Read more