kodalinani

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు , దోపిడీలకు మూల్యం చెల్లించుకుంటున్నారు. అధికార అండ చూసుకొని ఇష్టం వచ్చినట్లు చేసిన వారిపై ఇప్పుడు వరుస కేసులు నమోదు చేస్తున్నారు.ఇప్పటికే పలువురి ఫై కేసులు నమోదు కావడం తో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisements

ఇక ఇప్పుడు మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని ఫై కేసు నమోదు అయ్యింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్‌లను సోషల్ మీడియా మాధ్యమాల్లో నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారంటూ ఏయూ లా కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానని పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు.

అలాగే కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన వారి జాబితాలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి కూడా ఉన్నాడు.

Related Posts
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కోడి పందేలు
crock fight

తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోడి పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటితోపాటు గుండాట, లోన బయట, పేకాటలు కూడా పందెంరాయుళ్లను ఖుషీ చేయనున్నాయి. మందు-విందు-చిందు వంటి ప్రత్యేక ఏర్పాట్లతో Read more

ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌..!
Panchayat election schedule before February 15.

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15 లోపే విడుదలయ్యే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిచిన Read more

Sudan : దాడుల్లో 300 మంది మృతి – మానవతా సంక్షోభం
Sudan : దాడుల్లో 300 మంది మృతి – మానవతా సంక్షోభం

Sudan దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మృతి – మానవతా సంక్షోభం తీవ్రతరం ఆఫ్రికాలోని Sudan మరోసారి తీవ్ర మానవీయ విషాదానికి వేదికైంది. ర్యాపిడ్ సపోర్ట్ Read more

మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్
harish rao arrest

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. గురువారం ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు Read more

×