kerala high court

మ‌హిళ‌ల శ‌రీరంపై కామెంట్ చేసినా లైంగిక వేధింపే: కేర‌ళ హైకోర్టు

ఉద్యోగం చేసే మ‌హిళ‌లు ఎన్నో వత్తిడిలకు గురిఅవుతున్నారు. నిత్యం లైంగిక వేధింపుల ఇబ్బందులకు గురిఅవుతున్నారు. వారి శ‌రీరంపై కామెంట్ చేస్తుంటారు. ఇలా కామెంట్ చేసినా అది లైంగిక వేధింపు కిందికి వస్తుందని కేర‌ళ హైకోర్టు స్పష్టం చేసింది. మ‌హిళ‌ల శ‌రీరం నిర్మాణంపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేసినా.. అది లైంగిక వేధింపు అవుతుంద‌ని కేర‌ళ హైకోర్టు పేర్కొన్న‌ది.
త‌న‌పై న‌మోదు అయిన కేసును కొట్టివేయాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ‌కు చెందిన ఉద్యోగి పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది. జ‌స్టిస్ ఏ బ‌ద‌రుద్దీన్ ఈ తీర్పును ఇచ్చారు. కేర‌ళ విద్యుత్తు శాఖకు చెందిన ఓ మ‌హిళా ఉద్యోగినిపై మ‌రో ఉద్యోగి కామెంట్ చేశారు. దీంతో ఆమె లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేసింది. ఆ కేసును కొట్టివేయాల‌ని కోరుతూ ఆ ఉద్యోగి కోర్టును ఆశ్ర‌యించాడు. 2013 నుంచి ఆ ఉద్యోగి చాలా అస‌భ్య‌క‌ర‌మైన భాష‌ను వాడార‌ని, 2017లో అభ్యంత‌ర‌క‌ర‌మైన మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ చేసేవాడ‌ని ఆమె ఆరోపించింది. విద్యుత్తు శాఖకు ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం లేకుండాపోయిందన్నారు.


మ‌హిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్ష‌న్ 354ఏ(లైంగిక వేధింపులు), 509(మ‌హిళ‌ను కించ‌ప‌ర‌చ‌డం), సెక్ష‌న్‌120(ఓ) కింద కేసు బుక్ చేశారు. కేర‌ళ పోలీసు చ‌ట్టంలోని సెక్ష‌న్ 120(ఓ) కింద కూడా ఆ ఉద్యోగి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. అయితే కేవ‌లం శ‌రీర శౌష్ట‌వం బాగుంద‌ని కామెంట్ చేసినంత మాత్రానా.. త‌న‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేశార‌ని, ఆకేసును కొట్టివేయాల‌ని విద్యుత్తు శాఖ ఉద్యోగి కోర్టును ఆశ్ర‌యించారు.

కాల్స్‌, మెసేజ్‌ల‌తో నిందిత వ్య‌క్తి లైంగిక వేధింపుల కామెంట్స్ చేసిన‌ట్లు మ‌హిళా ఉద్యోగి ఆరోపించింది. అయితే ఐపీసీలోని సెక్ష‌న్ 354ఏ, 509తో పాటు సెక్ష‌న్ 120 కేర‌ళ పోలీసు చ‌ట్టం ప్ర‌కారం నిందితుడిపై త‌గిన ఆధారాలు ఉన్న‌ట్లు హైకోర్టు తెలిపింది.

Related Posts
యుద్ధ నౌకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
modi mh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా, రెండు అత్యాధునిక యుద్ధనౌకలు INS Read more

బస్సు టికెట్ ఛార్జీలను పెంచిన కర్ణాటక సర్కారు
బస్సు టికెట్ ఛార్జీలను పెంచిన కర్ణాటక సర్కారు

కర్ణాటకలో మహిళల ఫ్రీ బస్సుల వల్ల ఆర్టీసీకి మోయలేని భారం పడింది. దీనితో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న క్రమంలో తాజాగా బస్సు టికెట్ Read more

విద్యార్థుల నిరసనలు: ప్రశాంత్ కిషోర్‌పై కేసు
విద్యార్థుల నిరసనలు: ప్రశాంత్ కిషోర్‌పై కేసు

బీహార్‌లో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు శాంతి భద్రతల సమస్యలకు దారితీసాయి. ఈ నిరసనల సమయంలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్, ఆయన జన్ Read more

ఢిల్లీలో 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
Delhi's AQI crosses the 421 mark

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్క్‌ను దాటేసింది. దీనితో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *