CM Chandrababu held meeting with TDP Representatives

మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలి ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు.

Advertisements

ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు. బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్డీఏ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఇద్దరు నేతలు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related Posts
విజయసాయి రెడ్డి.. ఇది ధర్మమా? : బండ్ల గణేష్ ట్వీట్
vijayasai ganesh

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తనదైన శైలిలో స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ Read more

Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ..వీడియో వైరల్
Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ.. వైరల్ వీడియో!

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ అమితంగా పెరిగిపోతోంది. ఉద్యోగం లభించాలంటే పోటీ తారాస్థాయికి చేరిన ఈ రోజుల్లో, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రకమైన Read more

అమరావతి నిర్మాణానికి రూ. 2,723 కోట్ల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్
chandrababu

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు Read more

విడాకుల వార్తలకు బరాక్ ఒబామా చెక్
Happy birthday my love..Obama check for divorce news

న్యూయార్క్‌ : అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన భార్య మిషెల్ ఒబామాతో విడాకులు తీసుకుంటున్నారని వస్తోన్న వార్తలకు చెక్ పెట్టారు. ఆమె బర్త్ డే Read more

×