manipur cm

మణిపూర్ సీఎం నివాసం వద్ద బాంబు కలకలం

ఏడాదిగా మణిపూర్ లో జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణతో వందలాది మంది చనిపోయారు. అనేకులు తమ నివాసాలను కోల్పోయారు. రాష్ట్రం ఏడాదిగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం వద్ద బాంబు కలకలం రేపింది. బీరేన్ సింగ్ నివాసానికి కొన్ని మీటర్ల దూరంలో ఈ తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు. తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. బాంబును గుర్తించిన సమయంలో బీరేన్ సింగ్ నివాసంలో లేరని తెలుస్తోంది.
మణిపూర్ లో గత కొంత కాలంగా సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలనీ ఆ పార్టీ వారే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ రాకెట్ ప్రొపెల్డ్ బాంబును గత రాత్రి ప్రయోగించి ఉండొచ్చని… అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించి ఉంటారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisements
Related Posts
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ లకు నోటిఫికేషన్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ లకు నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ Read more

త్రివేణి సంగ‌మంలో రాష్ట్ర‌ప‌తి.
త్రివేణి సంగ‌మంలో రాష్ట్ర‌ప‌తి.

త్రివేణి సంగ‌మం భారతదేశంలో అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాలలో ఒకటి. ఇది గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవలి కాలంలో భారత రాష్ట్రపతి Read more

శ్వేత వర్ణంలో జమ్ముకశ్మీర్‌
Snowfall Blankets Jammu and Kashmir, Transforming Tourist

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్‌, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర Read more

భార్యతో సెల్ఫీ, మావోయిస్టు అగ్రనేత ప్రాణాలు తీసింది!
maoist chalapathi

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర, రాష్ట్ర పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో మృతి చెందిన వారిలో Read more

×