Business traits are in the blood of Indians.. Chandrababu

భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు: చంద్రబాబు

దావోస్‌: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. ప్ర‌పంచ దేశాల‌కు మ‌నోళ్లు అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామిక‌వేత్త‌లే క‌నిపిస్తున్నారు. భార‌తీయులు అందిస్తున్న సేవ‌లప‌ట్ల గ‌ర్వంగా ఉంది. ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో రాజ‌కీయ అనిశ్చితి ఉంది. కానీ, ఇండియాలో మాత్రం ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో స్థిర‌మైన ప్ర‌భుత్వం ఉందన్నారు.

Advertisements

మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. రెండున్న దశాబ్దాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం. అన్నిరంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్‌గేట్స్‌ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్‌, ఆర్థిక సంస్కరణలను ఉపయోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇదే తరహా సేవలు అందించాలి అన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్ అంటే, ఇదో పెద్ద లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటారు. కానీ, చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు తెలిసిన మా లాంటి వాళ్ళకి ఇది ఆశ్చర్యం ఏమి కాదు. హైదరాబాద్ ఈ రోజు ఇలా అభివృద్ధి చెందటానికి కారణం నాడు చంద్రబాబు గారి విజన్. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.

Related Posts
తమిళనాడులోనూ జనసేనను విస్తరిస్తాం – పవన్
గత ప్రభ్యుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు: పవన్‌ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీని తమిళనాడులోనూ విస్తరించే అవకాశముందని ప్రకటించారు. ఓ ప్రముఖ తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో Read more

LRS : LRS రాయితీ గడువు పెంచే అవకాశం?
Telangana government key update on LRS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) లో 25% రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన Read more

టీడీపీ నేతపై మాధవీలత ఫిర్యాదు
టీడీపీ నేతపై మాధవీలత ఫిర్యాదు

బీజేపీ నాయకురాలు, నటి మాధవి లత, టీడీపీ నేత మరియు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవి లత Read more

ఈఆర్సీ చైర్మన్‌గా దేవరాజు నాగార్జున
Devaraju Nagarjuna as ERC C

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. బుధవారం, జీఎస్టీ కాలనీలో ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈఆర్సీ పాలకమండలి Read more

×