భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ఇప్పుడు వానల వల్ల వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగర జీవన పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లు జలమయమై, ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, IT కంపెనీలు( IT companies) తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్( Work from home) అవకాశం ఇవ్వాలని బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ (Central BJP MP PC Mohan) విజ్ఞప్తి చేశారు.మే 18 ఉదయం 8:30 నుంచి మే 19 ఉదయం 8:30 వరకూ 105.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 2011 తరువాత బెంగళూరులో ఒకే రోజులో నమోదైన రెండో అత్యధిక వర్షపాతం. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ఉధృతంగా కనిపించాయి. వీధులు జలమయమై, ట్రాఫిక్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పూర్తిగా ఆగిపోయింది.ఈ పరిస్థితుల్లో పీసీ మోహన్ మాట్లాడుతూ, “ఇన్ఫోసిస్ సహా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలని” ట్విట్టర్ ద్వారా సూచించారు. ఈ సూచనపై స్పందిస్తూ, ప్రముఖ IT సంస్థ కాగ్నిజెంట్, మే 20న తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెప్పింది.

బెంగళూరులో కాగ్నిజెంట్‌కు సుమారు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు.ఇక మరో దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా మే 21న తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించింది.”వర్ష పరిస్థితుల దృష్ట్యా, బుధవారం (మే 21) ఉద్యోగులు మేనేజర్లతో చర్చించి, అవసరమైతే ఇంటి నుంచి పని చేయొచ్చు” అంటూ సంస్థ ఒక ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్టు సమాచారం. ఇన్ఫోసిస్ ఇప్పటికే వారంలో మూడు రోజులు ఆఫీసులో పని చేసే విధానాన్ని అమలు చేస్తోంది.హోసూరు రోడ్డులోని సిల్క్ బోర్డ్ నుంచి రూపేన అగ్రహార మార్గం వర్షాల వల్ల పూర్తిగా నీటమునిగిపోయింది.
దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ మార్గాన్ని మే 20 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా మూసేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.ఈ రోడ్డులో సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీ వరకు ఉన్న 9.9 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ఉంది. ఇది దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ జోన్ గా గుర్తింపు పొందిన ప్రాంతం. ఇక్కడ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, సిమెన్స్ లాంటి కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.వర్షాల వల్ల ప్రజల జీవితం సర్వంగా నిలిచిపోయింది. రోడ్లపై నిలిచిన నీటి వలన ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. స్కూళ్లు, కార్యాలయాలు మూతపడ్డాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే ప్రజలకు తాత్కాలిక ఉపశమనంగా మారింది.
Read Also : Rahul :రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మీడియా హైలెట్