r krishnaiah

బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య

త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్య సభ ఎంపీ ర్యాగ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను కేంద్రం ప్రకటించింది. కాగా గతంలో ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజేర్వేషన్లు, స్కాలర్ షిప్‌లపై ఆయన ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆయనకు తిరిగి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది.

Advertisements

Related Posts
KA Paul: పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు – పవన్ కళ్యాణ్‌పై మతపరమైన విమర్శలు!

ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు కేఏ పాల్ మరోసారి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయంగా Read more

అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్
జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై కేసు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం తో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా Read more

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్: కేటీఆర్‌
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు , శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి జరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల Read more

పోసానికి వైద్యపరీక్షలు పూర్తి
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనంతరం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌ కు తీసుకువచ్చిన పోలీసులు, అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ Read more

×