kharge

బీజేపీ ఎంపీలు నన్ను నెట్టేశారు: ఖర్గే లేఖ

ఈ ఉదయం నుంచి పార్లమెంటు ప్రాంగణం రణరంగాన్ని తలపిస్తోంది. అంబేద్కర్ అంశం పై బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చిన్న యుద్ధం జరుగుతున్నది. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విపక్షాలను ఆగ్రహావేశాలకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో, నేడు పార్లమెంటు ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఎన్డీయే, ఇండియా కూటమి పక్షాల ఎంపీల మధ్య తోపులాట జరగ్గా… బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేశ్ రాజ్ పుత్ గాయపడ్డారు.
ఈ క్రమంలో, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మకర్ ద్వార్ ఎంట్రన్స్ దగ్గర జరిగిన ఘర్షణ సందర్భంగా బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని, దాంతో తాను అదుపుతప్పి కిందపడిపోయానని వెల్లడించారు. తన మోకాళ్లకు గాయమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. తన మోకాళ్లకు అప్పటికే శస్త్రచికిత్స జరిగిందని, ఇప్పుడు కిందపడడంతో గాయం ప్రభావం మోకాళ్లపై ఎక్కువగా పడిందని ఖర్గే వివరించారు. వెంటనే కాంగ్రెస్ ఎంపీలు ఓ కుర్చీ తీసుకురావడంతో దానిపై కూర్చున్నానని తెలిపారు. అక్కడ్నించి తాను కుంటుతూనే సభకు వెళ్లానని పేర్కొన్నారు.

Advertisements

బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి తలకు లోతైన గాయం కావడంతో వైద్యులు కుట్లు వేశారు. ఈ ఇద్దరు ఎంపీలకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు.

Related Posts
షేక్ హసీనా అప్పగింత: భారతదేశ నిర్ణయం
sheikh hasina drupadi murmu

షేక్ హసీనా అప్పగింత: భారతదేశ బాధ్యత లేదా పరపతి? మానవత్వానికి వ్యతిరేకంగా ఆరోపించిన నేరాలకు స్వదేశానికి తిరిగి రావాలని కోరుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని అప్పగించాలని ఢాకా Read more

మరోసారికేజ్రీవాల్ విపశ్యన ధ్యానానికి వెళ్లనున్నారు
మరోసారికేజ్రీవాల్ విపశ్యన ధ్యానానికి వెళ్లనున్నారు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విపశ్యన ధ్యానానికి వెళుతున్నారు. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, కేజ్రీవాల్ పార్టీ కార్యక్రమాల్లో మినహా Read more

Chiranjeevi : యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం
Chiranjeevi యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం

Chiranjeevi : యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం తెలుగు చిత్రపరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు.ఈ సందర్బంగా ఆయనకు లండన్‌లో ఘనసన్మానం Read more

ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్
Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ బుక్ చేసుకోని లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తమ మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని Read more

×