dear krishna

బాలూగారిపాట మనసుని హత్తుకుంది: మోహన్‌లాల్‌

అక్షయ్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. ఈ సినిమాను దినేష్ బాబు దర్శకత్వంలో రూపొందించగా, పీఎన్ బలరామ్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘చిరురపాయం చేసుకున్న దోషమేంటో దైవమా అనే పాట ఎంతో చక్కగా సాగుతూ, వినిపించే ప్రతిసారీ హృదయాలను హత్తుకుంటోంది. ఈ లిరికల్ వీడియోను ప్రముఖ నటుడు మోహన్‌లాల్ విడుదల చేశారు పాటను విడుదల చేసే సందర్భంలో మోహన్‌లాల్ మాట్లాడుతూ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట నా మనసును అమితంగా ఆకట్టుకుంది. ఈ పాట ఎంతగా హృదయాలను చేరుకుందిo అలా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత పీఎన్ బలరామ్ మాట్లాడుతూ, ఈ చిత్రం ఓ నిజ ఘటన ఆధారంగా రూపొందించబడింది. హృదయాలను మృదువుగా తాకే ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాము అని తెలిపారు చిరురపాయం పాటకు గిరిపట్ల లిరిక్స్ అందించగా, హరిప్రసాద్ సంగీతం సమకూర్చారు ఈ చిత్రం సున్నితమైన కథాంశంతో ప్రేక్షకులను సెంటిమెంట్‌లో ముంచెత్తుతుందని భావిస్తున్నారు. సినిమాలోని పాటలు, సంగీతం ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు, చిత్రానికి మరింత బలం చేకూరుస్తాయనే ఆశించాలి.

    Related Posts
    L2E: Empuraan: మార్చి 27న విడుదల కానుంది : మోహన్ లాల్
    L2E Empuraan మార్చి 27న విడుదల కానుంది మోహన్ లాల్

    L2E: Empuraan: మార్చి 27న విడుదల కానుంది : మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో రూపొందుతున్న L2E: ఎంపురాన్ Read more

    నటుడు సోనూ సూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం
    Sankalp Kiron award to actor Sonu Sood

    హైదరాబాద్‌: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళా తోరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో Read more

    గేమ్ ఛేంజర్ పై శంకర్ రియాక్షన్స్
    రామ్ చరణ్ యాక్టింగ్ శంకర్ రియాక్షన్స్ గేమ్ ఛేంజర్

    ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు శంకర్, ఈసారి తెలుగులో డైరెక్షన్ చేసే సినిమా గేమ్ ఛేంజర్ తో సినిమా ప్రపంచాన్ని ఉత్సాహంగా ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా ఒక Read more

    మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి నిర్మల..
    మనోజ్కు-వ్యతిరేకంగా-తల్ manchu manoj

    మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వివాదాలపై తల్లి నిర్మలదేవి స్పందించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగలేదని స్పష్టంగా చెప్పిన ఆమె, Read more