The girl was raped by her u

బాలిక పై మేనమామ అత్యాచారం

ఏపీలో మహిళలపై , అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలుఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న కామాంధులు మాత్రం మారడం లేదు. పోలీసులు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న వారు మాత్రం బెదరడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా తాడేపల్లిగూడెం లో వరుసగా మేనమామ అయ్యే వ్యక్తి..9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పై అత్యాచారం చేసాడు.

Advertisements

బాలికకు వరుసకు మేనమామైన కమల్​ తాడేపల్లిగూడెం మండలంలోనే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు బాలిక ఇంటి దగ్గరకు వచ్చేవాడు. బాలిక ఆధార్ ​కార్డులో మార్పులు చేయాల్సి రావడంతో ఈ నెల 14న ఆమె అమ్మమ్మ కమల్​కు రూ.100 ఇచ్చి పంపించి ఆధార్ కార్డు పని చేయాల్సిందిగా కోరింది. దాన్నే ఆసరాగా తీసుకున్నాడు కమల్. దీంతో ఆయన వసతి గృహానికి చేరుకుని బాలికను బైక్ పై ఎక్కించుకుని చాగల్లు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను తాడేపల్లిగూడెం మండలంలోని ఆమె అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో అమ్మమ్మ ఏం జరిగిందని అడగ్గా, కమల్ చేసిందంతా వివరించింది. బాలికను నమ్మించి ఆధార్ పని మీద అతనితో ఇచ్చి పంపించడమే తప్పైంది అంటూ బాలిక అమ్మమ్మ విలపించింది. దీంతో బాలికను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమల్​పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు.

Related Posts
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
Another case registered against Vallabhaneni Vamsi

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత Read more

విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ పై జగన్ పిటిషన్
విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ పై జగన్ పిటిషన్

విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ పై జగన్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని జాతీయ కంపెనీ లా Read more

వారి ఖాతాల్లోకి రూ.20 వేలు:మంత్రి కీలక ప్రకటన
వారి ఖాతాల్లోకి రూ.20 వేలు:మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, మత్స్యకారులు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మత్స్యకారులకు మత్స్యకార భరోసా, రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలు Read more

ఏపీ నూతన డీజీపీ ఈయనేనా..?
ap new dgp harish kumar gup

ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గరపడుతుండడంతో నూతన డీజీపీ నియామకంపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్ కుమార్ Read more

×