krt

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు: కేటీఆర్‌

ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు అని కేటీఆర్‌ అన్నారు.
భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని తెలిపారు.
పీవీకి సముచితస్థానం ఇచ్చిన బీఆర్ఎస్
రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని వెల్లడించారు. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు.

నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని చెప్పారు. అంతే కాదు.. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిందని తెలిపారు. వారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు. భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి అని ఎక్స్‌ వేదిగా ట్వీట్‌ చేశారు.

Related Posts
కేటీఆర్ దావత్ పార్టీ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
KTRs brother in law Raj Pa 1

జన్వాడలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, “ఇళ్లలో దావత్‌లు Read more

హుస్సేన్ సాగర్ వద్ద నూతన సంవత్సరం: పోలీసుల ఆంక్షలు
హుస్సేన్ సాగర్ వద్ద నూతన సంవత్సరం: పోలీసుల ఆంక్షలు

2024 సంవత్సరానికి హైదరాబాద్ నగరం వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్న వేళ, నగరంలోని పోలీసు శాఖ సురక్షితంగా మరియు సంఘటనలు లేని నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు కఠిన Read more

SLBC టన్నెల్ లోకి రోబోలు
మృతదేహాల కోసం రోబోలు రంగంలోకి – హైదరాబాద్ అన్వీ రోబోటిక్ టీమ్ ప్రత్యేక ప్రదర్శన

టన్నెల్ లో చోటుచేసుకున్నప్రమాదం సందర్భంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడం ప్రస్తుతం అత్యవసరం అవుతోంది. ఎస్‌ఎల్‌బీసీ (సుజలాం సుఫలాం బహుద్దేశీయ కాలువ) టన్నెల్‌లో కూలిన శకలాల వల్ల చిక్కుకుపోయిన Read more

ఎమ్మెల్యే కోటా.. 10 MLC స్థానాలకు నేడు నోటిఫికేషన్
MLA quota

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో 10 ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు నేడు అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించగా, Read more