NAYAN

ప్లాస్టిక్ సర్జరీ ప్రచారం పై లేడి సూపర్ స్టార్ క్లారిటీ

తాను ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

“లేడీ సూపర్ స్టార్” అనే టాగ్‌లైన్‌ తో యూత్ పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తున్న భామ నయనతార. రెండు దశాబ్దాలుగా దక్షిణ భారతీయ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటూ వస్తుంది. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన నయనతార..మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో డియర్ స్టూడెంట్ , తమిళంలో జయం రవితో కలిసి తని ఓరియన్ 2 తో పాటు మరో మూడు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో నయనతారకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్స్ వైరల్ గా మారడం తో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. నా కనుబొమ్మలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకి ముందు వాటి ఆకారాన్ని మారుస్తూ ఉంటాను.అందుకోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాను.కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖంలో మార్పు వస్తుంది.

బహుశా ఈ కారణంతోనే నా ముఖంలో మార్పులు వచ్చాయని అందరు అనుకుంటూ ఉంటారు. అంతే కానీ ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజం కాదు.డైటింగ్ వలన కూడా నా ముఖంలో మార్పులు వచ్చి ఉండవచ్చు.ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్టు కనిపించి మరోసారి లోపలకి వెళ్లినట్టు కనిపిస్తాయి.కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడవచ్చు,నా బాడీ లో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదని చెప్పుకొచ్చింది. ఇక ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న నయనతార, సరోగసి ద్వారా ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్, మన్నన్​గట్టి సిన్స్​ 1960, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2, మూకుథి అమ్మన్ 2 చిత్రాల్లో నటిస్తోంది.

Related Posts
పార్టీ మార్పుపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ..
Ayodhya Rami Reddy clarity on party change

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజీనామాపై స్పందించారు. పార్టీ మార్పుపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీని వీడటం లేదని అయోధ్య రామిరెడ్డి Read more

అజిత్ లేటెస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
అజిత్ లేటెస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

అజిత్ అభిమానులు ప్రస్తుతం కొంచెం నిరాశగా ఉన్నారు. ఆయన తాజా సినిమా ‘విడాముయార్చి’ విడుదల వాయిదా పడటంతో ఈ ఫ్యాన్స్ కొంత కోపంతో ఉన్నారు. ఈ సినిమా Read more

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు..
Lokayukta notice to Chief Minister Siddaramaiah

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు Read more

169 ఎకరాల్లో సోలార్ సెల్ ప్లాంట్
Solar cell plant on 169 acr

ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద సోలార్ సెల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ Read more