ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (జనవరి 19) దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సదస్సులో పాల్గొనడానికి బయలుదేరుతున్నారు. ఈ సదస్సులో భాగస్వాములు అయ్యి, ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశమై, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే ప్రముఖ సంస్థలతో, గూగుల్ వంటి దిగ్గజాలతో పెట్టుబడుల ఒప్పందాలు సంతకయ్యా లయి. ఈ ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి.ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్ల పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టుల శంకుస్థాపనలు కూడా జరిగాయి. త్వరలో అర్సెల్లార్ మిత్తల్ స్టీల్ పరిశ్రమ, బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుల పనులు ప్రారంభం కానున్నాయి.సీఎం చంద్రబాబు బృందం రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ చేరుకుంటారు.

అక్కడ నుంచి జ్యూరిచ్ కు వెళ్లి, ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్ లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం జరుపుకుంటారు. తర్వాత, తెలుగు పారిశ్రామిక వేత్తలతో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా’ అనే సమావేశంలో పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు.అనంతరం 4 గంటల రోడ్డు ప్రయాణం చేసి, దావోస్ చేరుకుంటారు. మొదటి రోజు రాత్రి పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్ ఉంటుంది.రెండవ రోజు, సీఎం చంద్రబాబు CII సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొనాలి. అనంతరం సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్ స్పన్, ఎల్ జీ, సిస్కో వంటి కంపెనీల సీఈవోలతో సమావేశం అవుతారు.యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో కూడా సమావేశమవుతారు. దావోస్‌లో జరిగే ‘ఎనర్జీ ట్రాన్సిషన్’ చర్చా కార్యక్రమంలో,’బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో’ అనే అంశంపై కూడా చర్చించనున్నారు.
మూడవ రోజు కూడా, సీఎం పలు వ్యాపార దిగ్గజాలతో సమావేశం అవుతారు.రోజుకు కనీసం పదికిపైగా సమావేశాలు ఉంటాయి. నాలుగవ రోజు, దావోస్ నుంచి జ్యూరిచ్ వెళ్లి, స్వదేశానికి తిరిగి రానున్నారు.ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బృందంతో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఐటీ మంత్రి నారా లోకేశ్,ఇండస్ట్రీ శాఖ అధికారులతో పాటు,ఈడీబీ అధికారులు కూడా పాల్గొంటున్నారు.సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంపై దృష్టి సారించబోతున్నారు.ఈ పర్యటనతో, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం పెరిగి, యువతకు ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.