roja

ప్రజల కారణంగా వైసీపీ ఓడిపోలేదు: రోజా

ప్రజల కారణంగా వైసీపీ ఓడిపోలేదని… కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయిందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు… అప్పులపై అప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు నగరిలో వైసీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని రోజా విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు.
జగన్ ఓడిపోయినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయని తెలిపారు. వైసీపీ హయాంలో స్కూళ్లను జగన్ అద్భుతంగా తీర్చిదిద్దారని… కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
వాళ్లంతా ఇప్పుడు బాధపడుతున్నారు
జగన్ ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారని… చంద్రబాబును ఎందుకు గెలిపించామా? అని ఇప్పుడు వాళ్లంతా బాధపడుతున్నారని అన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం సహా అన్ని నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ క్యాడర్ ను ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో… వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. పచ్చ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

Advertisements
Related Posts
CBN -Pawan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
Deputy CM Pawan Kalyan meet CM Chandrababu today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. తాజాగా ముగిసిన క్యాబినెట్ Read more

టీటీడీ అధికారులపై చంద్రబాబు ధ్వజం
టీటీడీ అధికారులపై చంద్రబాబు ధ్వజం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరిగిన తొక్కిసలాట సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులు, పోలీసులు, మరియు సంబంధిత వ్యవస్థలను తీవ్రంగా ప్రశ్నించారు. ఆయన Read more

ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) రూ. 44,776 కోట్ల పెట్టుబడులతో కూడిన 15 ప్రాజెక్టులకు గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు Read more

Anakapalli : అనకాపల్లిలో సగం మృతదేహం లభ్యం
Anakapalli : అనకాపల్లి జిల్లా కసింకోటలో హత్య.. మృతదేహం అర్థభాగం మాత్రమే లభ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా మరోసారి హత్యాచార ఘటనతో కుదిపేసింది. కసింకోట మండలంలోని బయ్యవరం హైవేపై మంగళవారం ఉదయం తీరని ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు Read more

×