పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

పోసానిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు..

ఏపీలో కూటమి సర్కార్ దూకుడు రోజు రోజుకు పెంచుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే తమ పై విమర్శలు , అసభ్యకర మాటలు , వీడియోలు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందారో వారందరి పై కేసులు నమోదు చేస్తూ కటకటాకలాపాలుచేస్తుంది. ఇప్పటికే కీలక నేతలతో పాటు వైసీపీ సోషల్ మీడియా వారిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా పోసాని పై కూడా వరుసపెట్టి కేసులు నమోదు అవుతున్నాయి.

Advertisements

సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారన్న వంశీకృష్ణ.. వర్గాల మధ్య విబేధాలు తలెత్తేలా ఆయన మాటలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణ మురళిపై సీఐడీ అధికారులు 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది.

మరోపక్క చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలుచోట్ల పోసాని కృష్ణ మురళిపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందాయి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలకు కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఇక టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గురించి కూడా పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్ స్టేషన్‌లలో టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి ,కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఫిర్యాదులు చేశారు. మరోవైపు సినీ నటి శ్రీరెడ్డిపైనా పలుచోట్ల ఫిర్యాదులు అందాయి. ఇలా ఎన్ని కేసుల నుండి పోసాని బయట పడడం కష్టమే అని అంత మాట్లాడుకుంటున్నారు. పోసాని కృష్ణ మురళిని సైతం ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని టాక్ నడుస్తోంది.

సాధారణంగా పోసాని కృష్ణ మురళి దూకుడుగానే మాట్లాడుతారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ పై విరుచుకుపడేవారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు కూడా. అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఈ ఇద్దరు జగన్ పై విమర్శలు చేస్తే.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉండే పోసాని ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యేవారు. వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసేవారు. ఒకానొక దశలో పవన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసైనికులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. హైదరాబాదులో పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పోసాని. ఇటీవల అడపాదడపా బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై తెలుగు యువత అధికార ప్రతినిధి వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Posts
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు..!
Surrender of a key Maoist leader..!

లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర నిర్భందాలు పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ Read more

ఎకో పార్కులో ఫ్రీగా వాకింగ్ చేయొచ్చు నారా లోకేశ్
ఎకో పార్కులో ఫ్రీగా వాకింగ్ చేయొచ్చు నారా లోకేశ్

ప్రవేశ రుసుం తొలగింపు - వాకర్స్ మిత్రులకు నారా లోకేశ్ ఇచ్చిన హామీ మంగళగిరి వాసులకు ముఖ్యమంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఎకో పార్కులో ఉదయం Read more

మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి ప్రధాని నివాళులు
PM Modi pays tribute to Manmohan Singh

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, ప్రముఖ‌ ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్ సింగ్ గురువారం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. Read more

మరోసారి యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు
మరోసారి యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: మరోసారి యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు.సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల Read more

×