mohan

పోలీసుల‌కు మోహ‌న్ బాబు గ‌న్ అప్ప‌గింత

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు త‌న లైసెన్స్ గ‌న్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈరోజు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌న యూనివ‌ర్సిటీకి వెళ్లారాయ‌న‌. అనంత‌రం చంద్ర‌గిరి పోలీస్ స్టేష‌న్‌లో త‌న డ‌బుల్ బ్యారెల్‌ లైసెన్స్‌డ్ గ‌న్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌ల నేప‌థ్యంలో గ‌న్ స‌రెండ‌ర్ చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసులు ఆయ‌న్ను ఆదేశించ‌డంతో తాజాగా గ‌న్ అప్ప‌గించారు. మంచు మనోజ, మోహ‌న్ బాబుల మధ్య ఆస్తుల గొడవలు తారస్తాయికి చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. తాజాగా పోలీసులు మోహ‌న్ బాబును గన్ అప్పగించమని ఆ దేశించారు.

Advertisements

మరోసారి క్ష‌మాప‌ణ‌లు

మ‌రోవైపు జ‌ల్‌ప‌ల్లిలో త‌న నివాసం వద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై మోహ‌న్ బాబు తాజాగా మ‌రోసారి మాట్లాడారు. తాను ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌ర్న‌లిస్టుపై దాడి చేయ‌లేద‌న్నారు. ఈ సందర్భంగా మ‌రోసారి జ‌ర్న‌లిస్టుల‌ను ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇక ఆదివారం నాడు దాడిలో గాయ‌ప‌డిన జ‌ర్న‌లిస్టును ఆసుప‌త్రికి వెళ్లి మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

Related Posts
మార్చి 7న ఏపీ క్యాబినెట్ భేటీ
Cabinet approves AP Annual Budget

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మార్చి 7న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశం సచివాలయంలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్రంలోని Read more

మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి
chandrababu daggubati ven

దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తులు అయిన నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల Read more

Amaravati: రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!
amaravati

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్రం నుండి ఆర్థిక Read more

Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

తిరుపతి ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు Read more

×