Kollu Ravindra

పేర్ని నాని కుటుంబం పరారీలో ఉంది.. కొల్లు రవీంద్ర

వైసీపీ నేత పేర్ని నాని పరారీలో ఉన్నట్లు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయనపై కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నానిని వైసీపీ నేతలు పరామర్శించడాన్ని అయన తప్పుబట్టారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని పేర్ని నాని కుటుంబం తినేసిందని దుయ్యబట్టారు.
అందుకే పేర్ని నాని కుటుంబమంతా పరారీలోనే ఉందని పేర్కొన్నారు. దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని విమర్శించారు.
పేదల బియ్యం నొక్కేసి పేర్ని నాని నీతి కబుర్లు చెబుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండిపడ్డారు. పేర్ని నాని వ్యవహారంతో వైసీపీ మొత్తం దొంగల పార్టీనే అని అర్థమవుతుందని విమర్శించారు.
పేర్నిపై చట్ట ప్రకారం చర్యలు
పేర్ని నాని గోదాములో పౌర సరఫరాల శాఖ ఉంచిన 3708 బస్తాల రేషన్‌ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై చట్ట ప్రకారం చర్యలు వుంటాయని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయిన పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పేర్ని నాని కుటుంబంపై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. దీంతో ఆయన్ను వైసీపీ నేతలు పరామర్శిస్తున్నారు.

Advertisements

Related Posts
Narendra Modi: అమరావతిలో మోదీ పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభం
అమరావతిలో మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని సందర్శించనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి చరిత్రాత్మకమైన ఈ పర్యటనకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. Read more

చంద్రబాబుకి భయపడను: జగన్
భయపడను చంద్రబాబుకి జగన్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి కొత్త చర్చకు కారణమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో ఎమ్మెల్సీ Read more

Assembly: ఏపీ అసెంబ్లీకి కమిటీలను ప్రకటించిన స్పీకర్
Assembly: ఏపీ అసెంబ్లీకి కమిటీలను ప్రకటించిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీల ప్రకటన – పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సంబంధించిన వివిధ కమిటీలను అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఇప్పటికే అసెంబ్లీలో ముఖ్యమైన Read more

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్
ys jagan

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ Read more

×