perni nani

పేర్నినాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు కావడంతో ఆయన హై కోర్టును ఆశ్రయంచారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను ఏ6గా పేర్కొన్నారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పేర్ని నాని పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిటిషన్ ను విచారించనుంది.

Advertisements

బెయిల్ పై వున్న జయసుధ

ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైల్లో ఉన్నారు.. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదయింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Related Posts
YS Jagan: తెలుగువారందికీ ఉగాది శుభాకాంక్షలు :జగన్
YS Jagan: తెలుగువారందికీ ఉగాది శుభాకాంక్షలు :జగన్

ఉగాది పర్వదినం: వైఎస్ జగన్ శుభాకాంక్షలు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ Read more

ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయం – షర్మిల
ys sharmila

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు పెట్టుబడి కూడా రాని ధరలకు Read more

Andhra Pradesh MLAs: ప్రారంభం అయిన ఎమ్మెల్యే క్రీడా పోటీలు
Andhra Pradesh MLAs: ప్రారంభం అయిన ఎమ్మెల్యే క్రీడా పోటీలు

ఏపీలో ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు – మూడు రోజుల పాటు ఉత్సాహభరిత ఆటలు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు Read more

Chandra babu: కార్యకర్తల మీటింగ్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
Chandra babu: కార్యకర్తల మీటింగ్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

చంద్రబాబు కీలక హెచ్చరిక – పార్టీ పదవులపై స్పష్టత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశం Read more

×