pushpa 2 records

పుష్ప-2 సరికొత్త రికార్డు

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్-రష్మిక నటించిన పుష్ప-2 సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదల కాకముందే ప్రీమియర్స్ (DEC 4) కోసం అత్యంత వేగంగా 30+వేల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికే 8.52 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం అధికారిక విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపారు. మొదట ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు ఒక రోజు ముందుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

“పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ విలువలు, సాంకేతికతతో రూపొందిస్తున్నారని అంటున్నారు.

కాగా ఈ మూవీ ట్రైలర్ ఈరోజు విడుదల చేయబోతున్నారు. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా..థమన్ BGM అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో ఐటెం సాంగ్ లో శ్రీలీలే చిందులేయబోతుంది.

Related Posts
అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
116285323

అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్ Read more

Solar Eclipse : ఈ నెల 29న సూర్య గ్రహణం..కొన్ని రాశులపై ప్రభావం!
Solar eclipse on the 29th of this month..impact on some zodiac signs!

Solar Eclipse : ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. Read more

‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
game changer talk

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ మూవీ లో రామ్ చరణ్ Read more

కీర్తి సురేష్ 15 ఏళ్ల ప్రేమకథ
కీర్తి సురేష్ 15 ఏళ్ల ప్రేమకథ

టాలీవుడ్ నటి కీర్తి సురేష్ డిసెంబర్ 12, 2024న తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించి, Read more