శ్రీహరికోట : శ్రీహరికోట నుండి ఇస్రో ప్రయోగించిన పి ఎస్ ఎల్ వి – సి 59 ప్రయోగం విజయవంతం అయ్యింది. అంతరిక్ష కక్షలోకి చేరిన ప్రోబా – 3 ఉపగ్రహం సురక్షితంగా చేరింది. శ్రీహరికోట లోని మొదటి ప్రయోగ వేదిక నుండి -పి ఎస్ ఎల్ వి – సి 59 రాకెట్ ను ప్రయోగించిన అనంతరం 18నిమిషాలకు 40 సెకండ్లకు నిర్దిష్ట కక్షలోకి చేరుకున్న ప్రోబా – 3 ఉపగ్రహం చేరింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు రూపకల్పన చేసిన ప్రోబా – 3 మిషన్ పూర్తిగా సూర్యుని పై పరిశోధనలు చేయడం కోసం తయారు చేయబడింది. గతం లో ఇస్రో ప్రయోగించిన ఆదిత్య – ఎల్ 1 తరహాలో పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది.ప్రోబా – 3 ఉపగ్రహం లో రెండు వేరు వేరు మిషన్లు ఉంటాయి. ఒకటి సూర్యగ్రహణాన్ని , మరొకటి సూర్యగ్రహణం పై నీడను కృత్రిమంగా రూపొందించడానికి పనిచేస్తాయి.
సూర్యగ్రహణాల సమయం లో సూర్యుని పైన ,సూర్యుని చుట్టూ ఎలాంటి వాతావరణ పరిణామాలు ఉంటాయి వాటి మార్పుల పైన ప్రధానముగా ప్రోబా – 3 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. భూమికి అత్యంత ఎత్తులో 60 వేల కిలోమీటర్ల దూరం లో ప్రోబా – 3 లోని రెండు మిషన్ లు ఒకదానికి ఒకటి అనుసంధానంగా తిరుగుతూ అక్కడ పరిస్థితులను భూమికి అందిస్తుంది దాని ద్వారా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు అనుకున్న రీతిలో ప్రోబా – 3 ఉపగ్రహాన్ని కక్షలో నిలపడం లో ఇస్రో కీలక పాత్ర పోషించింది ఇది ఇస్రో కు మరో మైలురాయి గా చెప్పవచ్చు.