sweet

పిల్లల హృదయాలను గెలుచుకునే క్యారెట్,బాదం బర్ఫీ

క్యారెట్, బాదం బర్ఫీ చాల సులభంగా తాయారు చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లలు చాల ఇష్టంగా తింటారు. కారెట్ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలొరీస్ కలిగిన కారెట్, బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. బాదం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగివుంది. బాదంలో మగ్నీషియం మరియు కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

క్యారెట్, బాదం బర్ఫీ ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు:
బాదం పప్పు – 1 కప్పు
పంచదార – 2 కప్పులు
వెన్న – అర కప్పు
క్యారెట్ – 2
యాలకుల పొడి – అర టీ స్పూను
తయారు చేయు విధానం

దీన్ని తయారు చేయాలంటే ముందుగా బాదం పప్పును రాత్రి మొత్తం నానబెట్టాలి. తర్వాత దాని పొట్టుతీసేసి విడిగా ఉంచుకోవాలి. మరోపక్క క్యారెట్ ను కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత బాదం, క్యారెట్ ముక్కలను కలిపి, పాలతో మిక్సీకి పట్టి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి.

ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్ బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్ బాదం బర్ఫీ సిద్ధంగా ఉంటుంది.
దీనిని పండగలప్పుడే కాకుండా మామూలు సమయంలో కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Related Posts
దైవిక అనుభవాల ద్వారా శాంతియుత జీవితం..
peace

మన జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు దైవిక అనుభవాలు ఎంతో కీలకమైనవి. చాలా మంది తమ జీవితాలలో దైవంతో సంబంధం ఏర్పడినప్పుడు, ఒక అసాధారణ అనుభవం కలుగుతుందని Read more

మొటిమలు, మచ్చలకు గుడ్‌బై చెప్పే సహజ సలహాలు..
Get glowing and Acne free clear skin

మీ ముఖం మీద మొటిమలు మరియు మచ్చలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి, కదా? అయితే, సహజ చిట్కాలను పాటిస్తే, ఈ సమస్యలను సులభంగా పరిష్కరించుకొని, మీ ముఖాన్ని Read more

Health:వారసత్వ బట్టతలతో బాధపడుతున్నారా!ఈ చిట్కాలు మీకే.
Health:వారసత్వ బట్టతలతో బాధపడుతున్నారా!ఈ చిట్కాలు మీకే.

కొంతమందికి చిన్న వయస్సులోనే జుట్టు తగ్గిపోవడం, బట్టతల సమస్య ఎదురవడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా పురుషులలో బట్టతల వచ్చే ప్రధాన కారణం జన్యువులు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. Read more

షుగర్, బీపీ నియంత్రణకు ఇవి ఎంతో మేలైనవి: పెసలు
షుగర్, బీపీ నియంత్రణకు ఇవి ఎంతో మేలైనవి: పెసలు

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పెసలు ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో Read more