happy family

పిల్లల ఆత్మవిశ్వా సాన్ని పెంచడంలో తల్లిదండ్రుల బాధ్యత

పిల్లలు అన్ని విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అయితే వాళ్లు అలా ప్రవర్తించడానికి అమ్మానాన్నలు పిల్లలతో జాగ్రత్త గా వ్యవహరించాలి .

పిల్లల బలహీనతలను పదేపదే ఎత్తిచూపకూడదు. ఇలా వారి బలహీనతల గురించి మాత్రమే మాట్లాడితే కొంతకాలానికి వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం పోతుంది. పిల్లలు లేత మనసును కలిగి ఉండడం వల్ల సాధారణంగా విమర్శలను తట్టుకోలేరు. వారి బలాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఏదైనా పని చేస్తామని పిల్లలు ఉత్సాహం చూపించినప్పుడు.. అది నీవల్ల కాదని వాళ్ళను నిరుత్సాహపరచకూడదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో పని చేయిస్తే సమయం వృథా అవుతుందనుకుంటారు. దాంతో వాళ్లకు ఎప్పటికీ పనిరాదు. దగ్గరుండి సాయంపడి వాళ్లా పని పూర్తిచేసేలా చూడాలి. దీనివల్ల పిల్లలకు వాళ్లమీద వాళ్లకు నమ్మకం పెరుగుతుంది. మనం ఈదిన పని చెప్పినపుడు పిల్లలు దానిని పూర్తిచేస్తే వాళ్లను మెచ్చుకుని ప్రోత్సహించాలి. ఆలా పొగడడం వల్ల వాళ్లకి ఆనందం కలిగి మరింత ఉత్సాహంగా పనులు చేస్తారు. కానీ వాళ్లను పొగడటమే పనిగా పెట్టుకోకూడదు. అలా అలవాటు పడితే చిన్నపని చేసినా పొగడ్తల కోసం ఎదురుచూడటం మొదలుపెడతారు.

పిల్లతో తల్లితండ్రులు ఎప్పుడు స్నేహభావంతో ఉండాలి. ప్రతి విషయాన్నీ చెప్పుకునే శ్వేచ్చ తల్లితండ్రులు పిల్లలకు ఇవ్వాలి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.

Related Posts
స్నేహం పిల్లల అభివృద్ధికి ఎలా సహాయపడుతుంది?
friends

పిల్లలు ఒకరికొకరు మంచి స్నేహితులు అవ్వడం చాలా ముఖ్యం. స్నేహం అనేది జీవితం యొక్క ఒక ముఖ్యమైన భాగం. అది పిల్లల అభివృద్ధికి చాలా అవసరం. చిన్నప్పుడు Read more

పిల్లల ఆరోగ్యానికి అత్యవసరమైన ఇమ్యూనిటీ-బూస్టింగ్ ఫుడ్స్
immunity food

పిల్లల ఆరోగ్యానికి బలమైన ఇమ్యూనిటీ చాలా అవసరం. దీని ద్వారా వారు సులభంగా వ్యాధులను ఎదుర్కొని ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పిల్లల ఇమ్యూనిటీని పెంచేందుకు కొన్ని ముఖ్యమైన ఆహారాలు Read more

పిల్లల అభివృద్ధిలో డ్రాయింగ్ యొక్క పాత్ర..
drawing

పిల్లల మానసిక అభివృద్ధికి డ్రాయింగ్ (చిత్రలేఖన) ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ సృజనాత్మక చర్య పిల్లల ఆలోచనా శక్తిని పెంచడంలో, వారి భావనాత్మక సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో Read more

పిల్లల అభివృద్ధికి అనుకూలమైన పర్యావరణం ఎలా ఉండాలి?
children

పిల్లలకు అనుకూలమైన పర్యావరణం సృష్టించడం చాలా అవసరం. వారి అభివృద్ధి కోసం పరిసరాలను సరైన రీతిలో మార్చడం ఎంతో ముఖ్యమైందిది. ఒక మంచి పర్యావరణం పిల్లల శారీరక, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *