పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా

పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉపముఖమంత్రి పదవి చుట్టూ తిరుగుతున్నాయి . ఇన్నాళ్లు పవన్ చేసిన త్యాగాలు , సహాయాలు గుర్తింపు గా పవన్ కు ఉపముఖమంత్రి పదవి ఇచ్చినట్టు గా చెప్పిన తెలుగుదేశం పార్టీ , వారి అనుచరగణం ఇటీవల కాలం లో చేస్తున్న వ్యాఖలు కొత్త రాజకీయానికి తెర లేపాయి .రాజ్యాంగ రీత్యా ఉపముఖమంత్రి పదవికి ఎటువంటి గుర్తింపు లేదని , రాజకీయం గా సంతృప్తి పరచడం కోసం , రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఒక పదవి అని కొంత మంది వివిధ సామజిక మాధ్యమాలలో వ్యాఖలు చేస్తుండడం ఏపీ రాజకీయాలలో ఒకింత ఆసక్తిని రేకేత్తిస్తోంది . కొంత మంది తమ వాదనను బలపరచడం కోసం గతం లో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావిస్తున్నారు .

Advertisements
పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా
పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా

ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ ఉపముఖమంత్రి పదవికి అర్హుడు అని కొందరు , లోకేష్ ని ఉపముఖమంత్రి గా ప్రకటించాలని కొందరు చేస్తున్న వ్యాఖలు జనసేన నాయకులు , కార్యకర్తలలో అనుమానాన్ని కలిగిస్తున్నాయి .

ఒకప్పుడు పార్టీ అధినేత పవన్ కు ఉపముఖమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలుగు దేశం పార్టీ గౌరవించింది అని తాము భావిస్తే ఇప్పుడు ఉపముఖమంత్రి పదవికి గుర్తింపు లేదంటూ మా నాయకుడిని అవమానిస్తున్నారు అని జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్న జనసేన పార్టీ నేతలు అంటున్నారు .ఒకవేళ నారా లోకేష్ ని ఉపముఖమంత్రిగా ప్రకటిస్తే అది కూటమి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో అని ఇరు పార్టీల నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు .

Related Posts
నేటి నుంచి విశాఖలో IPL టికెట్లు
IPL2025

విశాఖపట్నంలో ఐపీఎల్ వేడుకలు మొదలయ్యాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఈ టోర్నమెంట్‌లో భాగంగా, విశాఖలోని డ్రైయింగ్ గ్రౌండ్‌గా ఎంపికైన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఢిల్లీ Read more

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్
Mushtaq Khan kidnap

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'స్త్రీ-2', 'వెల్కమ్' వంటి చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందిన ఆయనను దుండగులు గతనెల Read more

Bill Gates : భారతీయులు గొప్ప ప్రతిభావంతులు – బిల్ గేట్స్
Bill Gates

మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతీయుల ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, భారతీయుల పనితీరు, ఆలోచనాశైలి గురించి తన Read more

రేవంత్ సీఎం కావటం ప్రజల దురదృష్టం – కిషన్ కీలక వ్యాఖ్యలు
1629299 kishan reddy

తెలంగాణలో మెట్రో విస్తరణ ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెట్రో విస్తరణను తాను Read more

×