Nothing launched the industrys first co created smartphone

పరిశ్రమలో మొదటి సహ-సృష్టించిన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన నథింగ్

ఆరు నెలలు, నలుగురు విజేతలు మరియు ఒక విలక్షణమైన ఉత్పత్తి- నథింగ్ తమ సరికొత్త స్మార్ట్ ఫోన్ : ఫోన్ (2ఎ) ప్లస్ యొక్క కొత్త ఎడిషన్ ను తయారు చేయడానికి తమ కమ్యూనిటీని ఆహ్వానించింది. ఫలితంగా కాంపైన్ లో కేంద్రంగా ఫైర్ ఫ్లైస్ తో చీకటి వెర్షన్ లో వెలుగును చూడవచ్చు.

న్యూఢిల్లీ: నథింగ్ ఈరోజు కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ యొక్క అంతిమ ఫలితాలను విడుదల చేసింది. ద ఫోన్ (2) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ నథింగ్ యొక్క మొదటి సహ-సృష్టించిన ఉత్పత్తి. దీని యొక్క అత్యంత ప్రతిభ కలిగిన కొంతమంది అనుచరులు నేరుగా నథింగ్ టీమ్ తో కలిసి పని చేసారు. హార్డ్ వేర్ నుండి వాల్ పేపర్స్ వరకు, ప్యాకేజింగ్ నుండి మార్కెటింగ్ వరకు, ఈ స్మార్ట్ ఫోన్ ను నథింగ్ కమ్యూనిటీ ఊహతో పూర్తిగా తీర్చిదిద్దబడింది.

కంపెనీ మరియు కమ్యూనిటీ మధ్య అడ్డంకిని నిర్మూలించాలని కోరుకునే ఒక కొత్త విధానానికి నథింగ్ మార్గదర్శకత్వంవహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రాధాన్యతని పొందింది, ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుండి 900కి పైగా ఎంట్రీలు వచ్చాయి. కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ నథింగ్ యొక్క మొదటి ప్రధానమైన పైలట్. ఇది హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, కంటెంట్ ను తన కమ్యూనిటీతో సహ-సృష్టిస్తుంది, వ్యాపారం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమైన చర్యను ముద్రించింది.

విజతలు అస్ట్రిడ్ వాన్ హుసే & కెంటా అకాసకి, అండ్రెస్ మటియోస్, ఇయాన్ హెన్రీ సిమ్మండ్స్ మరియు సోన్యా పల్మాలు గెలుపు భావనలను మరింత ఉత్తమంగా చేయడానికి లండన్ లో నథింగ్ డిజైన్ స్టూడియో, క్రియేటివ్, బ్రాండ్ మరియు మార్కెటింగ్ టీమ్స్ తో సన్నిహితంగా సహకరించారు. నథింగ్ టీమ్ మరియు కమ్యూనిటీల మధ్య ఈ సహకారం యొక్క ఫలితంగా ఫోన్ (2ఎ) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్, ప్రసిద్ధి చెందిన ఫోన్ (2ఏ) ప్లస్ యొక్క చీకటి వెర్షన్ లో వెలుగుగా వ్యాఖ్యానించబడింది.

దశ 1 – హార్డ్ వేర్ డిజైన్..

నథింగ్ డిజైన్ డైరెక్టర్ ఆడమ్ బేట్స్ మరియు సిఎంఎఫ్ డిజైనర్ లూసీ బిర్లీతో కలిసి అస్ట్రిడ్ వ్యాన్ హుసే & కెంటా అకాసకి తమ “ఫాస్ఫోర్ సెన్స్ “ భావనను నిజం చేయడానికి వివిధ రకాల రంగులు మరియు మెటీరియల్స్ తో ప్రయోగం చేస్తూనే, డివైజ్ యొక్క కీలకమైన నథింగ్ గుర్తింపును పొందుపరిచారు. ఆకుపచ్చ రంగు ఫాస్ఫోర్ సెంట్ మెటీరియల్ ఫినిష్ లను ఉపయోగించారు, ఫోన్ వెనక భాగం ఎలిమెంట్స్ చీకటి వాతావరణంలో సున్నితమైన మెరుపును ప్రసరిస్తాయి. ఈ ఫీచర్ పూర్తిగా అనలాగ్ టెక్నిక్ తో పని చేస్తుంది, విద్యుత్తు అవసరం లేదు మరియు పగటి వేళ కాంతితో రీఛార్జ్ చేసేంత వరకు క్రమేణా వెలసిపోవడానికి ముందు చాలా గంటలు అదే విధంగా వెలుగును ఇస్తుంది.

దశ 2 – వాల్ పేపర్ డిజైన్..

హార్డ్ వేర్ డిజైన్ ఆధారంగా, ఆండ్రెస్ మటియోస్ “కనక్టెడ్ కలక్షన్“ ను సృష్టించడానికి AI సాధనాలు మరియు డిజిటల్ డిజైన్ మిశ్రమాన్ని ఉపయోగించారు. నథింగ్ సాఫ్ట్ వేర్ డిజైన్ డైరెక్టర్ మ్లాడెన్ ఎం హోయ్ స్ మరియు సాఫ్ట్ వేర్ డిజైనర్ కెన్ జియాంగ్ తో కలిసి ప్రారంభంలో నాలుగు వాల్ పేపర్స్ ను అభివృద్ధి చేసే పనిని ఆరంభించిన ఆండ్రెస్ అంతిమ కలక్షన్ ను ఆరు వాల్ పేపర్స్ కు విస్తరించాలని నిర్ణయించారు.

దశ 3 – ప్యాకేజింగ్ డిజైన్..

అయన్ హెన్రీ సిమ్మండ్స్ తన “లెస్ ఈజ్ మోర్“ భావనతో నథింగ్ ప్యాకేజింగ్ డిజైన్ ను పునః వ్యాఖ్యానించారు – ఇది గ్రాఫికల్ గా విస్తారంగా ఉన్నా సాధారణమైన సూపర్-మేక్రో చిప్. అంతిమ ప్యాకేజింగ్ లో గెలిచిన హార్డ్ వేర్ డిజైన్ కు పూరకంగా చీకటి వాతావరణంలో మెరిసే రిఫ్లెక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

దశ 4 – మార్కెటింగ్ కాంపైన్..

సోన్యా పల్మా తన సన్నిహితమైన మరియు శక్తివంతమైన కాంపైన్ భావన, ‘ఫైండ్ యువర్ లైట్‘ తో అన్ని అంశాలను ఒక చోట చేర్చారు. ఈ ఆకర్షణీయమైన కాంపైన్ “సహజమైన స్వభావం“ అని కాంపైన్ కు కీలకంగా నిలిచిన నథింగ్ యొక్క అత్యంత మొదటి ఉత్పత్తి విడుదలను ప్రతిబింబిస్తోంది. మన అందరికీ అన్వేషించడానికి అర్హమైన అంతర్గత శక్తి ఉందని ఆలోచనను రెండూ సూచిస్తాయి. సోనియా నథింక్స్ క్రియేటివ్ టీమ్ తో కలిసి ఫిల్మ్ కాంపైన్ మరియు ఉత్పత్తి ప్రారంభానికి మద్దతునిచ్చే డిజిటల్ సంపత్తి సహా అమోఘమైన సంపత్తి యొక్క సమూహాన్ని అభివృద్ధి చేసారు.

కమ్యూనిటీలో నుండి ఆవిర్భవించింది..

సహ-సృష్టించడం నథింగ్ మిషన్ లో కీలకంగా ఉంది. ఫోన్ (2ఏ) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ప్రస్తుతం కమ్యూనిటీ టీమ్ యొక్క అతి పెద్ద ప్రాజెక్ట్ గా నిలిచింది. సాఫ్ట్ వేర్ మరియు కంటెంట్ ను సహ-అభివృద్ధి చేయడానికి నథింగ్ నిరంతరంగా కమ్యూనిటీ సభ్యులతో కలిసి పని చేస్తోంది. 2022లో, నథింగ్ కమ్యూనిటీ బోర్డ్ అబ్జర్వర్ బాధ్యతను కూడా పరిచయం చేసింది, అనగా ఎంపికైన వ్యక్తి నథింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశాల్లో కమ్యూనిటీకి ప్రాతినిధ్యంవహిస్తారు.

లభ్యత మరియు ధరలు..

నథింగ్ ఫోన్ (2ఏ) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ను 12 నవంబర్ న 12/256 GB కోసం రూ. 29,999కి కొనుగోలు చేయడానికి కమ్యూనిటీ సభ్యులకు అవకాశం ఉంది. ఈ ఎడిషన్ ను కొనుగోలు చేసే వివరాలు నథింగ్ కమ్యూనిటీ ప్లాట్ ఫాంపై లభిస్తాయి, ఇక్కడ సభ్యులు పూర్తి సమాచారం కనుగొనవచ్చు మరియు విలక్షణమైన కొనుగోలు లింక్ ను స్వీకరించడానికి రిజిస్టర్ చేయవచ్చు. అంతర్జాతీయంగా కేవలం 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి.

ఇంకా, కమ్యూనిటీ సభ్యుల కోసం ప్రత్యేకించి ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం కూడా నిర్వహించబడుతుంది. నథింగ్ ఇండియా వారి సామాజిక ఛానల్స్ ద్వారా త్వరలోనే తత్సంబంధిత వివరాలు తెలియచేయబడతాయి. నథింగ్ ఫోన్ (2ఎ) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ను కొనుగోలు చేయడానికి, నథింగ్ కమ్యూనిటీలో భాగంగా ఉండటం అవసరం. కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ ఫోన్ అన్ని మార్కెట్లలో లభిస్తోంది మరియు ఫోన్ (2ఏ) ప్లస్ పై అభివృద్ధి చేయబడింది. కమ్యూనిటీ ఎడిషన్ మీడియా కిట్ లో ఇక్కడ ఫోన్ (2ఎ) ప్లస్/ఫోన్ (2ఏ) కమ్యూనిటీ ఎడిషన్ యొక్క చిత్రాలు మరియు వీడియోలను దయచేసి కనుగొనండి.

Related Posts
Business and finance: prioritise a nature-positive Amazon
double exposure photograph business conference with gathering people backdrop city office building background generative ai

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text Read more

More Americans Covered by Health Insurance in 2020, CDC Says
focused team leader presenting marketing plan interested multiracial coworkers

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text Read more

Leavenworth Street corridor seeing solid business growth
business team collaboration discussing work analysis with financial data marketing growth report

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text Read more

పండుగ సీజన్ తో పాటు తెలంగాణ విక్రేతల అభివృద్ధికి కట్టుబడి ఉన్న అమెజాన్..
Amazon is committed to the development of Telangana sellers along with the festive season

విక్రేతల వ్యాపార వృద్ధిని పెంచడానికి బహుళ ఉత్పత్తి విభాగాలలో విక్రయ రుసుముల పరంగా గణనీయమైన తగ్గింపును ప్రకటించింది. Amazon.inలో విక్రయదారులు తమ ఉత్పత్తి ఎంపికను విస్తరించడంలో సహాయపడటానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *