AP state cabinet meeting today

నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. అయితే ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో .. ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

Advertisements

ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దాంతో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా ఈ కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల తేదీ ఖరారు అయింది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటి వరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ఈ నెల ముగియనుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బడ్జెట్‌తో పలు బిల్లులను రెండు సభల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related Posts
ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
encounter jammu kashmir

జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల Read more

నేడు హర్యానాలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
AP CM Chandrababu will visit Haryana today

అమరావతి : : ఏపీ సీఎం చంద్రబాబు హర్యానాలో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ Read more

రేవంత్ రెడ్డి మాదిరి లుచ్చా పనులు చేయలేదు – కేటీఆర్
ktr tweet

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ కోసం తన నివాసం నుంచి కార్యాలయానికి బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన పార్టీ Read more

2027 లో నాసిక్ లో మళ్ళీ కుంభమేళా
ప్రపంచవ్యాప్తంగా భక్తుల దృష్టి 2027 నాసిక్ కుంభమేళాపై!

అత్యంత భారీ మతపరమైన వేడుక అయిన మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. మహాశివరాత్రి రోజున ఈ మహోత్సవం అధికారికంగా Read more

×