Distribution of pensions in

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరిట రూ.4 వేల ఫించన్‌ సక్రమంగా పంపిణీ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Advertisements

ఈ క్రమంలోనే ఈసారి అనంతపురం జిల్లాలో పర్యటించి సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లాలో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు.

గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు. హంగు ఆర్భాటాలకు దూరంగా.. సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. రాయదుర్గం నియోజవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి శనివారం చంద్రబాబు చేరుకుంటారని వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి హెలిప్యాడ్‌ స్థలాన్ని, ఆంజనేయస్వామి దేవాలయాన్ని, గ్రామసభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Related Posts
మాధవీలతపై కేసు
మాధవీలతపై కేసు

సినీ నటి మరియు రాజకీయ నాయకురాలు మాధవీలత, తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. మాధవీలత ఫిర్యాదు మేరకు Read more

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు
commercial gas cylinder pri

commercial gas cylinder price hike న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా Read more

పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి నోటీసులు !
Notices to Patnam Narender Reddy once again!

హైదరాబాద్‌: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. Read more

Telangana : తెలంగాణలో రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ
Distribution of fine rice from tomorrow in Telangana

Telangana : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి కూడా సన్న బియ్యం అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంపై సివిల్ సప్లైస్, Read more

       
×