నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు..ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు..ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు.. ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం రాష్ట్ర 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను తీసుకుని అంతకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు , మంత్రులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం వెంట ఉన్నారు.

Advertisements

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ రాజధాని రైతుల్ని పలుకరించారు. అమరావతి ఉద్యమంలో వారంతా కీలక పాత్ర పోషించారని అభినందించారు.కాగా.. ఈసారి రాష్ట్ర బడ్జెట్ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు పేర్కొంటున్నారు.

మరోవైపు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావద్దని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో జగన్‌ భేటీ కానున్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైఎస్‌ఆర్‌సీపీ నిరసన తెలుపనుంది. మాక్‌ అసెంబ్లీ నిర్వహించనున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు…అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు దోరంగా ఉండనున్నారు. కాగా, రూ.2.7 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ఉండనుంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఇవాళ ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..

ఇకపోతే..ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన వారికి ఎలా వ్యవహరించాలో సూచించారు. మిగిలిన పదవుల పైన కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. పార్టీ కోసం కష్టాలు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పదవుల్ని బాధ్యతగా భావించాలని స్పష్టం చేసారు. ఎక్కడా పదవీ అహంకారం, హడావుడి ఉండకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

నామినేటెడ్ పదవులు పొందిన వారు సింపుల్‌ గవర్నమెంట్‌.. ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ అనే మన నినాదాన్ని గుర్తు పెట్టుకుని, ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు సూచించారు. కష్టపడి పనిచేసి, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేసారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి న్యాయం చేయాలనే ప్రాతిపదికన పదవులకు ఎంపిక చేసామని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగానే పదవులు ఖరారు చేసామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీ కోసం పని చేసిన వారికి పదవులిచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పార్టీ కోసం నిలబడిన యువత, మహిళలను ప్రత్యేకంగా గుర్తించామని చెప్పారు. కింది స్థాయిలో పని చేసే కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే ఇతర పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించటం తో పాటుగా సభ్యత్వ నమోదు, లక్ష్యాలను చేరుకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇంకా చాలామందికి ఆయా కార్పొరేషన్‌ డైరెక్టర్లతో పాటుగా ఇతర పదవులిస్తామని చెప్పారు. రెండేళ్ల పదవీ కాలాన్ని సమర్థంగా ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్దేశించారు.

Related Posts
శాస్త్రీయ ఉత్సుకతను పెంపొందిస్తోన్న వెల్‌స్పన్ ఫౌండేషన్
Welspun Foundation for Health & Knowledge, fostering leadership and scientific curiosity in Telangana

హైదరాబాద్ : వెల్‌స్పన్ ఫౌండేషన్ ఫర్ హెల్త్ & నాలెడ్జ్, ఇటీవల తెలంగాణలో నాయకత్వ నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటుగా శాస్త్రీయ ఉత్సుకతను ప్రోత్సహించడానికి రెండు ప్రభావవంతమైన Read more

రేపు కేంద్ర కేబినెట్ భేటీ..
Central cabinet meeting tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక Read more

మన గ్యాలాక్సీని అన్వేషించడానికి కొత్త మార్గం.
lhb

మన సూర్యమండలానికి సమీపంలో ఒక "ఇంటర్స్టెల్లర్ టన్నెల్" కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త కనుగొనబడిన టన్నెల్ గురించి పరిశోధన "ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్" జర్నల్ లో Read more

ఏపీకి బుల్లెట్ ట్రైన్.. ?
bullet train

ఏపీలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతోందా..? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలన్నది సీఎం చంద్రబాబు డ్రీమ్. పదేళ్ల నాటి కల Read more

×