ఈ రోజుల్లో ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’పై చర్చ రోజుకో మలుపు తిరుగుతుంది. వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన ప్రకటనతో ఈ చర్చ మొదలైంది. అయితే తాజగా నారాయణమూర్తి కుటుంబ సంపద కేవలం 24 గంటల్లో దాదాపు రూ.1,900 కోట్లు తగ్గింది. నిన్న శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపించిగా ఈ సమయంలో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దింతో కంపెనీ మార్కెట్ క్యాప్ లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయింది.

భారతీయులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాకుండా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి అన్నారు. వారానికి ఆరు రోజులు కాకుండా ఐదు రోజులు మాత్రమే పని చేసే సంప్రదాయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకూండా వారానికి 70 గంటలు పని చేయాలని ఆయన సూచించారు. ఆయన ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. చివరికి పెద్ద పెద్ద దిగ్గజా కంపెనీ ప్రముఖులు కూడా ఇందులో భాగమైయ్యారు.
ఇన్ఫోసిస్ షేర్ల పతనం శుక్రవారం బిఎస్‌ఇలో ఇన్ఫోసిస్ షేర్లు 5.8%తో భారీగా పడిపోయాయి. నిన్న సాయంత్రానికి ఇన్ఫోసిస్ షేరు రూ.1,815.10 వద్ద ముగిసింది. ఈ విధంగా నారాయణ మూర్తి కుటుంబ సంపదలో భారీ క్షీణత సంభవించింది ఇంకా అతని మొత్తం సంపద దాదాపు రూ.1,900 కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్‌లో మొత్తం 4.02% ఉన్న కుటుంబ వాటా, షేర్ల విక్రయం తర్వాత రూ.30,292 కోట్లకు తగ్గింది. ఈ విధంగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.53 లక్షల కోట్లకు తగ్గింది.