nallabelli

నల్లబెల్లి మండలంలో పెద్దపులి సంచారం

వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతులు, కూలిలకు ఆ వ్యవసాయ భూమిలో ఏదో అడవి జంతువు పాదముద్రలు కనిపించడం తో అందులో కొంత మంది రైతులు పెద్దపులి పాదముద్రలుగా గుర్తించి భయభ్రాంతులకు గురైన సంఘటన వరంగల్ జిల్లా నెల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామాల శివారులోని వ్యవసాయ భూముల్లో చోటుచేసుకుంది. రైతులు, కూలీల కథనం ప్రకారం రుద్రగూడెం గ్రామ శివారు లోకం హనుమంతు, మండ రాజిరెడ్డి, నూటెంకి మంకయ్య అనే రైతులతో పాటు మరికొంత మంది రైతులు మిర్చితో, ఇతర పంట నెల్లల్లో వ్యవసాయ పసుల కోసం వెళ్లిన రైతులకు, రైతు కూలీంకు వ్యవసాయ భూమిలో పులి కాలి మాదిరిగా పాదముద్రలు గమనించడంతో రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులు, భయభ్రాంతులకు గురయ్యారు. గురువారం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో కుక్కలు పరుగెత్తుతూ సుమారు గుంట పాటు అరుస్తూ ఉండటం కొందరు గమనించారు. ఉదయం పులి అడుగులు కనిపించడంతో రాత్రి వేళ ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరించడాన్ని గమనించిన కుక్కలు అరుస్తూ వెంబడించనట్లు భావిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. సమీప కొండా పూర్ గ్రామ శివారులో నుంచి ఈ పెద్దపులి వచ్చి వ్యవసాయ భూముల నుండి రుద్రగూడెం మీదగా కొండాయిపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. అందించడంతో నర్సంపేట రేంజ్ లో పెద్దపులి సంచరించిన గుర్తులు కలిగిన వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు.

Related Posts
రాహుల్ గాంధీ పేరును ఎన్నికల గాంధీగా మార్చాలి: కేటీఆర్
రాహుల్ గాంధీ పేరును ఎన్నికల గాంధీగా మార్చాలి: కేటీఆర్

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (KTR) బుధవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల Read more

పాతాళగంగలో స్నానానికి దిగిన తండ్రి, కుమారుడు గల్లంతు
పాతాళగంగ పుణ్యస్నానం చేస్తున్న తండ్రి, కుమారుడు మృతిచెందారు.

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో విషాదం శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పెద్ద హర్షోల్లాసాలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భక్తులు తమ ఆధ్యాత్మికతను పునరుద్ధరించుకునే ఉద్దేశంతో, పాతాళగంగ Read more

రాజాసింగ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల తొలగింపు
Deletion of Raja Singh Facebook and Instagram accounts

హైదరాబాద్‌: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు చెందిన 2 ఫేస్‌బుక్‌ పేజీలు, 3 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించడంపై ఆయన ఎక్స్‌ లో స్పందించారు. Read more

ఈరోజు నుండి మూడు రోజుల పాటు “రైతు పండుగ”
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు నుండి మూడు రోజుల పాటు ‘రైతు పండుగ’ నిర్వహించనున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *