Karthika Pournami tirumala

దీపాల వెలుగుల్లో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

కార్తీక మాసంలోని పవిత్రమైన పర్వదినం కార్తీక పౌర్ణమి రాగానే భక్తి శోభతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ప్రత్యేక పూజలతో ప్రకాశిస్తున్నాయి. వేకువజామునే భక్తులు పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు చేసి, కార్తీక దీపాలను నదిలో వదిలి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో కూడా భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది.తిరుమల మాడ వీధులు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. అలిపిరి కాలినడక దారి భక్తులతో నిండిపోయి, ఎటుచూసినా భక్తుల సందోహం కనిపిస్తోంది. “శ్రీనివాసా శరణం శరణం” అంటూ భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉత్సాహంగా బారులు తీరుతున్నారు.టీటీడీ అధికారుల ప్రకారం, ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం 56,711 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 19,775 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా ఆ రోజు రూ. 3.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని అధికారులు వెల్లడించారు.శ్రీశైల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వేలాది మంది తరలివచ్చారు. తెల్లవారుజామునే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించి, తమ మొక్కులు తీర్చుకున్నారు.

గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధుల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించిన ప్రకారం, అధిక రద్దీ కారణంగా ఈసారి గర్భాలయ అభిషేకాలు నిలిపివేసి, భక్తులకు అలంకార దర్శనమే కల్పిస్తున్నారు. కార్తీక మాసం ప్రత్యేకతను ఆస్వాదించడానికి ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.

Related Posts
చివరి అంకానికి చేరుకున్న ‘బతుకమ్మ’
saddula bathukamma

బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, Read more

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.!
tirupati laddu

స్వామివారి ప్రసాదంగా లడ్డు ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉంది. భక్తుల నమ్మకం, ఈ ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూల తయారీ, Read more

ఆలయంలో సరైన సదుపాయాలు లేక భక్తుల ఇబ్బందులు
ఆలయంలో సరైన సదుపాయాలు లేక భక్తుల ఇబ్బందులు

అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయం కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఉన్న అతి ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతిరోజూ భక్తులు స్వామి దర్శనం Read more

‘నమశ్శివాయ’ అంటే ఏంటో తెలుసా?
Lord Shiva at Murudeshwar

హిందూ ధర్మంలో పవిత్రమైన మంత్రాల్లో 'ఓం నమశ్శివాయ' కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం గా పిలుస్తారు, ఎందుకంటే దీనిలో 'న, మ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *