indian currencey

దారుణంగా పతనమైన రూపాయి విలువ

రోజురోజుకు రూపాయి మారకం విలువ పడిపోతూ వున్నది. నేడు దారుణంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్‌ను తగ్గించడం, 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. బలహీన మూలధన ప్రవాహాలకు తోడు ఇతర ఆర్థిక సవాళ్ల కారణంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కరెన్సీపై ఇది అదనపు భారాన్ని మోపింది.
మరింతగా దిగజారిన మారకం విలువ
డాలర్‌తో పోలిస్తే బుధవారం రూపాయి మారకం విలువ రూ. 84.9525కు పడిపోగా, గురువారం మరింత క్షీణించి రూ. 85.0650కు దిగజారింది. రెండు నెలల్లోనే రూపాయి మారకం విలువ రూ. 84 నుంచి 85కు పడిపోవడం గమనార్హం. అదే సమయంలో రూ. 83 నుంచి రూ. 84కు క్షీణించడానికి 14 నెలల సమయం పట్టింది. అంతకుముందు రూ. 82 నుంచి రూ. 83కు పతనం కావడానికి 10 నెలల సమయం పట్టగా, ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే రూ. 84 నుంచి రూ. 85కు పడిపోయింది.
ఇతర దేశాలో కూడా పతనం
అయితే, భారత కరెన్సీ ఒక్కటే కాదు, ఇతర దేశాల కరెన్సీ కూడా భారీగా క్షీణించింది. ఆసియా దేశాల కరెన్సీ కూడా గురువారం భారీగా పతనమైంది. కొరియన్ వొన్, మలేసియా రిగ్గిట్, ఇండోనేషియన్ రుపయా 0.8 శాతం నుంచి 1.2 శాతం క్షీణించింది.

Related Posts
మహా కుంభానికి తరలివచ్చిన భక్తుల సముద్రం
మహా కుంభానికి తరలివచ్చిన భక్తుల సముద్రం

మహా కుంభ్ 2025 పండుగ మూడు పవిత్ర నదులు, గంగా, యమునా మరియు పౌరాణిక సరస్వతి యొక్క పవిత్ర సంగమం అయిన త్రివేణి సంగం వద్ద మకర Read more

కుంభమేళా భక్తులకు సగం ధరకే విమాన టికెట్ల ధరలు
kumbh mela flight charges

కుంభమేళా సందర్భంగా భక్తులకు సగం ధరకే విమాన టికెట్లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయం భక్తులకు ఆర్థిక భారం తగ్గించేందుకు సహాయపడనుంది. Read more

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఉదయం 9 గంటల వరకూ 6.61 శాతం పోలింగ్‌..
Maharashtra and Jharkhand assembly elections. 6.61 percent polling till 9 am

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జార్ఖండ్ విషయంలో కొంత ప్రశాంతత ఉండగా.. మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల రోజున కూడా రాజకీయ హడావుడి కనిపిస్తోంది. Read more

ఈ అరాచకం మనం సృష్టించుకున్నదే: బంగ్లా ఆర్మీ చీఫ్
ఈ అరాచకం మనం సృష్టించుకున్నదే: బంగ్లా ఆర్మీ చీఫ్

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో.. దేశం మొత్తం సర్వనాశనమైన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌కి తత్వం బోధపడినట్టుంది. ఇప్పుడేమో దేశం ప్రమాదంలో ఉందని, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *