salaar prashanth neel

థియేటర్లలో వచ్చిన రిజల్ట్ పట్ల తృప్తిగా లేనన్న ప్రశాంత్ నీల్

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారీ విజయాన్ని అందుకుంది.ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నటించగా, హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది.సలార్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.ఒక ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఆయన మాటల్లో,సలార్ సక్సెస్‌ను నేను ముందే ఊహించాను. కానీ, నా సంతృప్తి మాత్రం పూర్తిగా లభించలేదు, అని చెప్పడం గమనార్హం. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, కేజీఎఫ్ సిరీస్ సంచలన విజయాల తర్వాత తనపై వచ్చిన ప్రెషర్‌ను నెరవేర్చడంలో కొంత వెనుకబడి పోయానని భావిస్తున్నానని చెప్పారు. “సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు, కానీ ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయాననే భావన నాకు ఉంది. థియేటర్లలో సినిమా రిజల్ట్ చూసినప్పుడు తృప్తి కలగలేదని అంగీకరిస్తున్నాను,అని ఆయన తెలిపారు.

తన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సలార్ 2 కోసం మరింత కృషి చేశానని ప్రశాంత్ నీల్ చెప్పారు.సలార్ 2 సీక్వెల్ కథ పక్కాగా రెడీ అయ్యింది.ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ప్రేక్షకులకు ఈసారి ఏ మాత్రం నిరాశ కలగకుండా మేము కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తున్నాం,అని ఆయన ధీమాగా చెప్పారు.ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోపై భారీ అంచనాలు ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సలార్ 2 కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.సలార్ నుంచి వచ్చిన సాలిడ్ బజ్,ప్రశాంత్ నీల్ స్టైల్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ సీక్వెల్ మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మరోసారి ప్రభాస్ అభిమానుల హృదయాలను గెలుచుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సలార్ 2 ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు.

Related Posts
జాబిలమ్మ నీకు అంత కోపమా హిట్టూ కొట్టేనా
జాబిలమ్మ నీకు అంత కోపమా హిట్టూ కొట్టేనా

తమిళనటుడు ధనుష్‌ హీరోగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా వరుస విజయాలను సాధిస్తున్నారు. తాజాగా, ఆయన తన మేనల్లుడు పవిష్ నారాయణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన Read more

స్పిరిట్ పై లేటెస్ట్ అప్డేట్
prabhas scaled

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ చిత్రం స్పిరిట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. Read more

కోర్ట్ మూవీ రివ్యూ
కోర్ట్ మూవీ రివ్యూ

సినిమా రిలీజ్ వరకు ఎంతగా ప్రమోట్ చేసుకున్నా, ఎంత హైప్ క్రియేట్ చేసినా, అసలు ఫలితం మాత్రం విడుదల తర్వాతే తెలుస్తుంది. నాని తన చిత్రం మీదున్న Read more

ఓటీటీలోని టాప్ 10 మూవీస్ ఇవే.
ott movies

2019లో విడుదలైన ఈ చిత్రం పూర్ణ అనే యువ క్రికెటర్ జీవితంలో ప్రేమ, విఫలం,పెళ్లి, కష్టం, విజయాల రసవత్తర ప్రయాణాన్ని చూపిస్తుంది.ఈ సినిమాను హాట్‌స్టార్‌లో చూడొచ్చు. 2012లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *