arjun awards

తెలుగు తేజాలకు అర్జున పుర‌స్కారాలు

మన తెలుగు అమ్మాయిలకు రెండు అర్జున పుర‌స్కారాలు లభించాయి.
కేంద్రం ప్ర‌క‌టించిన జాతీయ క్రీడా పుర‌స్కారాల్లో తెలుగు తేజాలు ఇద్ద‌రు ఎంపిక‌య్యారు. అథ్లెటిక్స్ విభాగంలో య‌ర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిల‌కు అర్జున అవార్డులు ద‌క్కాయి. ఇక య‌ర్రాజి జ్యోతి ఏపీలోని విశాఖ‌ప‌ట్నం వాసి కాగా, జివాంజి దీప్తిది తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా.

Advertisements


32 మంది అర్జున పుర‌స్కారాలు
ఈ ఏడాది ఈ ఇద్ద‌రితో స‌హా మొత్తం 32 మంది అర్జున పుర‌స్కారాలకు ఎంపిక‌య్యారు. అటు ఖేల్ ర‌త్న‌కు మ‌ను బాక‌ర్‌, గుకేశ్‌, ప్ర‌వీణ్ కుమార్, హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఇక అర్జున అవార్డు (జీవితకాలం సాఫ‌ల్య పుర‌స్కారం) కోసం సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా-స్విమ్మింగ్) ఎంపిక‌య్యారు. అలాగే ద్రోణాచార్య అవార్డు కోసం కోచ్‌లు సుభాష్ రాణా (పారా-షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ)ను ఎంపిక చేయ‌డం జ‌రిగింది.ఇదిలాఉంటే.. జాతీయ క్రీడా అవార్డులు-2024 విజేతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ ఈరోజు (గురువారం) ప్ర‌క‌టించింది. ఈ నెల 17న‌ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందుకోనున్నారు.

Related Posts
నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
cm revanth reddy district tour

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. వయనాడ్ ఉపఎన్నిక నేపథ్యంలో బుధవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎంపీగా Read more

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్య‌లు
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎక్స్ (ట్విట్టర్) వేదికపై చేసిన Read more

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపులు..
Bomb threats to 6 planes at Shamshabad Airport

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 6 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం అందింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, విమానాశ్రయంలో కఠినమైన తనిఖీలను ప్రారంభించారు. మంగళవారం దేశంలోని Read more

తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం
Confusion of GBS cases in East Godavari district

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 రెండు కేసు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ Read more

×