shyam benegal

తెలంగాణ ముద్దుబిడ్డ.. శ్యామ్‌ బెనెగల్‌: కేసీఆర్‌

భారతీయ సినిమా దర్శక దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మ భూషణ్ శ్యామ్ బెనగల్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాన్యుల జీవన ఇతివృత్తాలకు వెండితెర గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడని, భరత మాత కన్న తెలంగాణ ముద్దు బిడ్డ శ్యామ్ బెనగల్ (బెనగల్ల శ్యామ్ సుందర్ రావు) అని కొనియాడారు. విస్మరించబడిన మనుషుల సామాజిక నేపథ్యాలకు సినీమా రంగంలో సమాంతర స్థానం కల్పించారని అన్నారు.

kcr

భారతీయ సినిమాకు వన్నె
ఇటు తెలంగాణ జీవన నేపథ్యాన్ని, అటు దేశీయ సామాజిక సంస్కృతిక వైవిధ్యాన్ని ఇరుసుగా చేసుకుని, ఆలోచింప చేసేవిధంగా దృశ్యమానం చేస్తూ, డాక్యుమెంటరీలు సినిమాల రూపంలో వారందించిన సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చలన చిత్ర రంగంలో తన కృషితో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించి, భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్ బెనెగల్ తెలంగాణకు గర్వకారణం అని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్స్‌ డిగ్రీ
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన ఆయన హైదరాబాద్‌ ఫిల్మ్‌ సొసైటీని స్థాపించి తన సినీ ప్రయాణానికి బాటలు వేసుకున్నారు. తన 90వ జన్మదినానికి ముందు బెనెగల్‌ మాట్లాడుతూ తాను మూడు, నాలుగు ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నానని చెప్పడం విశేషం.

Related Posts
కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ
CID should investigate comprehensive family survey.. Shabbir Ali

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ Read more

చెన్నైలో భారీ వర్షాలు
WhatsApp Image 2024 12 12 at 12.22.31

దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడే అవకాశం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం. దీని అనుబంధంగా మధ్య ట్రోపోఆవరణం వరకు Read more

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు అనుమతి
High Court approves Group 1 Mains exams in Telangana

హైదరాబాద్‌: : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 21వ తేదీ Read more

ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి
ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. గతేడాది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *