indra sena reddy

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్‌ను నవంబర్ 2023లో 15 రోజుల పాటు ట్యాప్ చేసినట్లు తాజాగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను విచారించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబరు 19, 2023లో ఇంద్రసేన రెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాతే ఆయన ఫోన్ ట్యాప్ చేయడం గమనార్హం.
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి నేతలపైనే నిఘా పెట్టినట్టు భావించారు. అధికారుల దర్యాప్తులో బీజేపీకి సంబంధించి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న ఇంద్రసేనరెడ్డి ఫోన్‌‌ను కూడా రెండు వారాల పాటు ట్యాపింగ్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆయన పీఏను కూడా అధికారులు విచారించారు. ఇంద్రసేన రెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూస్తున్న నేపథ్యంలో.. ఆయనను ఇందులో సాక్షిగా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఇంద్రసేన రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.

Related Posts
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి యువకుల మృతి
kondapochamma dam

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మార్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. Read more

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది – కేటీఆర్
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది - కేటీఆర్. Read more

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ – నిధులు, ప్రాజెక్టులపై చర్చ
CM Revanth condemns attacks on houses of film personalities (1)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తినకు Read more

ప్రొద్దుటూరులో నేడు సీఎం రేవంత్, చిరంజీవి
revanth

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో నేడు ప్రత్యేక వేడుక జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రముఖ సినీనటుడు చిరంజీవి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *